Heavy rain: నగరంలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంపీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీ విజ్జప్తి చేశారు. మరో గంటసేపు కూడా భారీ వర్షం కురిస్తే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. నగరంలో మరో గంటసేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కూకట్‌పల్లి, మూసాపేట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్,హైదర్‌నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్, అమీర్‌పేట్, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరోవైపు భారీ వర్షంతో రోడ్డపై ఎక్కడికక్కడ నీరు నిలుస్తుంది. అయితే ఈరోజు ఆదివారం కావడంతో ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఉండరు. అందుకోసమని.. ట్రాఫిక్కు ఎలాంటి సమస్య లేదు. కానీ.. భారీ వర్షంతో రోడ్లన్నీ నీట మునిగాయి. మరోవైపు.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: PM Modi: 100 మిలియన్లకు చేరిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్