HDFC Bank : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ ఇది. ప్రత్యేకించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ వాడుతున్న వారు ఈ కొత్త అప్‌డేట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అదేమిటంటే.. బ్యాంకు తమ మొబైల్ యాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్డేట్ చేస్తోంది. యాప్‌లో పెద్దఎత్తున మార్పులు జరగబోతున్నాయి. అదనంగా కొత్త సెక్యూరిటీ ఫీచర్లను యాడ్ చేయ బోతున్నారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ కొత్త వర్షన్ కస్టమర్లు అందరికీ ఒకేసారి అందుబాటులోకి రాదు. విడతల వారీగా కస్టమర్లకు దీన్ని అందుబాటులోకి తెస్తారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ కొత్త వర్షన్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చే ప్రాసెస్ 2024 మార్చి 5 నుంచి మొదలైంది. వచ్చే 4 నుంచి 6 వారాల్లోగా కస్టమర్లు అందరికీ ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను బ్యాంకు కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తున్నారు.హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ కొత్త వెర్షన్ కోసం ఏమేం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
క్రిటికల్ సెక్యూరిటీ ఫీచర్..
హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్(HDFC Bank) నూతన వర్షన్‌లో ‘క్రిటికల్ సెక్యూరిటీ ఫీచర్’ ఉంది. దీనిలో భాగంగా మొబైల్ నంబర్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను జోడించారు. బ్యాంకు దగ్గర కస్టమర్ నమోదు చేసిన మొబైల్ నంబర్‌తో అనుసంధానమై ఉన్న సిమ్ కార్డుతో అకౌంట్ కంట్రోల్ అవుతుంది.
Also Read : Fake Cancer Drugs : రూ.100 ఇంజెక్షన్ రూ.3 లక్షలకు సేల్.. ఫేక్ మెడిసిన్ మాఫియా గుట్టురట్టు
మొబైల్ బ్యాంకింగ్ యాప్ అప్‌డేట్ ఇలా..
- గూగుల్ ప్లే స్టోర్ HDFC Bank అని సెర్చ్ చేసి మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది.
- బ్యాంక్ అకౌంట్లో నమోదు చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిమ్ కార్డు.. మీ మొబైల్ బ్యాంకింగ్ డివైజ్‌లోనే తప్పకుండా ఉండాలి.
- మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కోసం యాక్టివ్ ఎస్ఎంఎస్ సబ్‌స్క్రిప్షన్ అవసరం.
- యాప్ అప్డేట్ చేసిన తర్వాత వన్ టైమ్ అథెంటికేషన్ కోసం మీ డెబిట్ కార్డు వివరాలు ఇంకా నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి.
- మొబైల్ బ్యాంకింగ్ యాప్ అప్‌డేట్ చేసుకున్న తర్వాత.. ఈజీ లాగిన్, క్విక్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు వీలు అవుతుంది. వేగవంతమైన బదిలీల కోసం ఐఎంపీఎస్, యూపీఐ, నెఫ్ట్ ఇతర ఏ పద్ధతులనైనా వాడుకోవచ్చు.
- యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో బిల్ పేమెంట్స్ సులభతరం అవుతాయి.
- ఏఐ పవర్డ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీ నుంచి ఏ ప్రశ్న లేదా సందేహానికి పరిష్కారం కోసం 24/7 EVA చాట్‌బాట్ సపోర్ట్ ఉంటుంది.