Surya Namaskar by the Leopard : సుశాంత నందా తాజాగా షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాను బాగా వైరల్ అవుతుంది. యోగాలో ఒక భాగమైన ఈ సూర్య నమస్కారాలను చేయడం మనకు అలవాటైన పనే. కానీ, చిరుత పులి సూర్య నమస్కారాలు చేస్తే..? ఆశ్చర్యంగా ఉంది కదా..! కానీ ఇది నిజం. అడవిలోని ఓ చిరుత ఉదయానే నిద్రలేస్తూనే సూర్య నమస్కారాలు చేయడం, దాని సుశాంత నందా వీడియో తీసిసోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ వీడియోని మీరు సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేసాడు. ‘సూర్య నమస్కారం చేస్తున్న చిరుత’ అని ఆ వీడియోకు టాగ్ లైన్ పెట్టారు. ఈ వీడియో షేర్ చేయగానే లక్షకుపైగా వ్యూస్, 2,500 లైకులతో నెటిజన్లు వైరల్ చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వాటికెవరు యోగా నేర్పిస్తున్నారు? యోగా టీచర్ లేరు, యూట్యూబ్ లేదు, పుస్తకాలు లేవు?’ ఎలా సాధ్యం అని యూజర్ కామెంట్ చేశాడు.
Surya Namaskar by the leopard 👌👌
Via @Saket_Badola pic.twitter.com/jklZqEeo89— Susanta Nanda (@susantananda3) March 27, 2023