Site icon HashtagU Telugu

Sahara Refund : ‘సహారా గ్రూప్’ రీఫండ్ కోసం అప్లై ఇలా..

Sahara Refund

Sahara Refund

Sahara Refund : సహారా గ్రూప్‌కు చెందిన కోఆపరేటివ్ సొసైటీల్లో డబ్బులు దాచుకున్న డిపాజిటర్ల సొమ్మును తిరిగి చెల్లించేందుకు కేంద్ర సర్కారు రెడీ అయింది. ఈ ప్రక్రియ కోసం mocrefund.crcs.gov.in అనే రీఫండ్ పోర్టల్‌ను  ప్రారంభించింది. ఈ పోర్టల్‌లోకి లాగిన్ అయి వివరాలను సమర్పించడం ద్వారా సహారాలో పెట్టుబడి పెట్టిన వాళ్లంతా డబ్బును తిరిగి పొందొచ్చు. దాదాపు 10 కోట్ల కంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులకు ఇదే పోర్టల్ ద్వారా డబ్బులను తిరిగి చెల్లిస్తారు. తొలుత రూ.10వేలలోపు పెట్టుబడి పెట్టిన వాళ్లకు అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఆ తర్వాత.. దశల వారీగా రీఫండ్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్తారు. సెబీలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లకు మాత్రమే రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను కూడా కలిగి ఉండాలి. ఈ అప్లికేషన్లను సెబీ పరిశీలించి వివరాలన్నీ సరిగ్గా ఉంటే 45 రోజుల తర్వాత అమౌంట్‌ను రీఫండ్(Sahara Refund)  చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

పోర్టల్​లో అప్లికేషన్ భర్తీ ఇలా.. 

  • అప్లికేషన్ ప్రాసెస్‌లో భాగంగా తొలుత mocrefund.crcs.gov.in వెబ్‌సైట్‌‌లోకి లాగిన్ కావాలి. ఇందుకోసం 12 అంకెల మెంబర్‌షిప్ నంబర్, ఆధార్ కార్డు చివరి నాలుగు అంకెలు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ మీ ఫోన్ నంబరుకు వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
  • ఆ వెంటనే మీరు లాగిన్ అవుతారు.  ఆధార్ ద్వారా ప్రాంప్ట్ కోసం మీరు ‘ఐ అగ్రీ’(I AGREE) బటన్ నొక్కాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీ ఆధార్ కార్డు వివరాలు ప్రత్యక్షం అవుతాయి.
  • ఇది కనిపించిన తర్వాత.. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్‌పై కనిపించే డీటెయిల్స్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ క్లెయిమ్‌పై క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్‌ను చెక్ చేసుకోవాలి.
  • మీ లేటెస్ట్ ఫొటో పెట్టి.. క్లెయిమ్‌ ఫాంపై సిగ్నేచర్ చేయాలి.
  • తదుపరిగా అప్‌లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. క్లెయిం ఫాం, పాన్ కార్డులను అప్‌లోడ్ చేయండి.
  • మీరు పొందే క్లెయిమ్ అమౌంట్ రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే పాన్ కార్డు తప్పనిసరి.
  • వీటన్నింటి కంటే ముఖ్యమైనది ఏమిటంటే..  మీ క్లెయిమ్ రిక్వెస్ట్ నంబరును తప్పనిసరిగా ఒక కాగితంపై రాసుకోవాలి. దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. అది భవిష్యత్తులో రీఫండ్ ప్రక్రియ కోసం రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది.

Also Read: Jeevan Reddy : 70 స్థానాలతో తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నాం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా