Site icon HashtagU Telugu

Poveglia Island : అది పిశాచాల దీవి.. అక్కడ ఏకంగా 1,60,000 మంది మృత్యు ఘోష!

A7607869 Bd79 479b 9c28 249a68ebf677

A7607869 Bd79 479b 9c28 249a68ebf677

ఇటలీ వెనిస్,లిడో తీరంలో పోవెగ్లియా దీవి ఉంది. ఈ దీవిని పిశాచాల దీవిగా పిలుస్తారు. ప్రస్తుతం అక్కడ మనుషులు ఎవరు జీవించడం లేదు. అక్కడ బ్లాక్ డెత్ అనే వ్యాధి సోకిన పేషంట్ లను చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. 1,60,000 మంది మృతి ఒడిలోకి జారుకున్నారు. అయితే భయానక ఘటన తరువాత ఆ దీవి పై నిషేధం విధించి అక్కడకు పర్యాటకులు కూడా వెళ్లే అవకాశం లేకుండా చేశారు. ఇకపోతే ఆమధ్య ఇద్దరు టూరిస్టులు దీవిలోకి వెళ్లారట. అయితే ఆ దీవిలోకి వారు రహస్యంగా నైనా వెళ్ళి ఉండాలి లేదంటే ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని వెళ్లి ఉండాలి. అయితే నిజానికి అదొక అందమైన దీవి.

ఆ దీవిలో అడుగు పెట్టాము అంతే ఇటలీ లోని ఉత్తర ప్రాంతంలో స్వర్గంలో అడిగి పెట్టినట్టుగా ఉంటుంది. చుట్టూ నీలిరంగులో సముద్రం నీరు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అందమైన తీరాలు దివి మధ్యలో ఉన్న చర్చి చుట్టూ అల్లుకున్న పచ్చదనం ఇలా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రశాంతతను ఇస్తుంటాయి. అలాగే దీనిలో మరింత ముందుకు వెళితే మధ్యయుగం నాటి శిధిల కట్టడాలతో కూలిపోతూ ఉన్న ఆస్పత్రికి కథలు మనకు కనిపిస్తాయి. అయితే గత 54 మేలుగా ఆ దీవి అందులో మానసిక రోగుల ఆసుపత్రి మూసి ఉన్నాయి.

ప్రస్తుత ఆసుపత్రిని ప్రకృతి ఆక్రమించింది. ఒకప్పుడు అక్కడ మనుషులు నడిచినప్పుడు ఇప్పుడు దుమ్ములా మారిపోయాయి. ఇక అప్పటి రోగుల ఆర్తనాదాలు,ఆవేదనలు కష్టాలకు హాస్పిటల్ గోడలు సాక్ష్యాలుగా నిలిచాయి. దశాబ్దాల పాటు ప్రజలను ఆ దీవికి లాక్కెళ్లారు. అందరితో ఆగకుండా వారిని కొడుతూ తిడుతూ ఉండేవారు. వారి అరుపులు గావు కేకలతో దీవి మొత్తం దద్దరిల్లింది. ఇకపోతే ఆ చిత్ర హింసలు భరించలేక చనిపోయిన వాళ్ళను తగలబెట్టి డానికి అక్కడ ఏకంగా 18 ఎకరాల స్థలం కూడా ఉంది. ఇటలీలో బ్లాక్ డెత్ వ్యాధి మరింత మందికి సుఖకుండా ఉండడానికి 1,60,000 నందిని ఒక్కసారిగా తగలబెట్టే ది చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ దీవిలోని మట్టిలో దాదాపుగా 50 శాతం వరకు బూడిదనే కనిపిస్తూ ఉంటుంది. బూడిద అంతా కూడా అప్పట్లో తగలబెట్టిన మనుషులదే.

Exit mobile version