Site icon HashtagU Telugu

BRS: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

Gutha Amith Reddy joined Congress

Gutha Amith Reddy joined Congress

Gutha Amith Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి(Gutta Sukhender Reddy) కుమారుడు గుత్త అమిత్‌రెడ్డి(Gutha Amith Reddy) కాంగ్రెస్‌(Congress)లో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు. గత కొన్ని రోజులుగా అమిత్ పార్టీ మారతారనే ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈరోజు ఉదయం అమిత్‌రెడ్డి నివాసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి వెళ్లారు. ఈ మేరకు వారు అమిత్‌ను కాంగ్రెస్ చేరాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేర గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read Also: Chiranjeevi : చిరంజీవి ప్రచారానికి రాబోతున్నారు.. నటుడు పృథ్వీ కామెంట్స్..

కాగా, పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ అమిత్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో ఆయన కాంగ్రెస్ చేరి అదే స్థానం నుంచి బరిలో నిలవాలని అనుకున్నారు. కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రీఎంట్రీతో ఆయనకు టికెట్ దక్కకుండా పోయింది. దీంతో ఆయన అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు, సభలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే ఆయన తండ్రి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్థం లేని రాజకీయాలే బీఆర్ఎస్‌ను కొంపముంచాయని, బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారైందంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. సొంత పార్టీలోనే లీల్లిపుట్లను కేసీఆర్ తయారు చేశాడని బహిరంగానే విమర్శించారు. పార్టీ నేతల అహంకారంతో బీఆర్ఎస్ అధికారంతో పాటు ప్రజలకు దూరమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ రెడ్డితో పాటు సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతాడా.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతార అనేది ఆసక్తికరంగా మారింది.