Site icon HashtagU Telugu

Sticking Cans: ఐస్కాంతం లాంటి తల.. అరుదైన గిన్నిస్ రికార్డ్ సాధించిన వ్యక్తి?

Sticking Bottles Head

Sticking Bottles Head

మామూలుగా అయస్కాంతం ఇనుము పక్క పక్కన పెడితే అతుక్కోవడం సహజం. అయస్కాంతానికి ఇనుప వస్తువులు అతుక్కుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక మనిషి తలకు వస్తువులు అతుక్కుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన జామీ కీటన్ అనే వ్యక్తికి ఇలా జరుగుతుంది. అతని తలకు ఇనుము లాంటి ఏదైనా పదార్థం దగ్గరగా పెట్టగా వెంటనే అతుక్కుంటున్నాయి. దీనితో అతన్ని అందరూ క్యాన్ హెడ్, క్యాన్ పా అని పిలుస్తున్నారు. దీనినే స్కిన్ సక్షన్ అని కూడా అంటున్నారు.

తాజాగా ఇదే విషయంలో ఈయన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. జామీ కీటన్ అనే వ్యక్తికి మనవడు మనవరాలు కూడా ఉన్నారు. ఇక వాళ్లు ఆయన్ని క్యాన్ పా అని పిలుస్తూ ఉంటారట. 2016లో ఇతను 8 డ్రింక్ క్యాన్లను తలపై నిలబెట్టుకొని దాదాపు 5 సెకండ్ల పాటు అలాగే ఉంచాడట. దాంతో అతని పేరు గిన్నిస్ రికార్డుకు ఎక్కగా 2019లో జపాన్ కి చెందిన సునిచి కన్నో అనే వ్యక్తి అతని తలపై ఏకంగా తొమ్మిది క్యాన్ లను నిలబెట్టుకొని గిన్నిస్ రికార్డును సంపాదించుకున్నాడు. దీనితో ఎలా అయినా గిన్నిస్ రికార్డును సాధించాలి అనుకున్న జామీ కీటన్ ఏకంగా 10 క్యాన్ లను తలపై నిలబెట్టుకొని ఆ రికార్డును తిరిగి తన పేరు పైన రాయించుకున్నాడు.

అయితే అలా క్యాన్లు అతని తలను అతుక్కోవడానికి అతని చర్మానికి ఒక రకమైన కండిషన్ ఉందట. దానికి ఇటువంటి పేరు లేకపోగా అతని చర్మం లోని కన్నాలు ఆక్సిజన్ ను పీల్చుతాయట. అతనికి ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడే ఈ లక్షణాలు మొదలయ్యాయట. కాగా చిన్నప్పుడు అతని చేతులకు ఇదే విధంగా అతుక్కున్నా కూడా అతని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదట. అతను చిన్నప్పుడు ఎక్కువగా చెట్లు ఎక్కుతూ ఉండడం వల్ల ఆ జిగురు వల్ల అలా బొమ్మలు అతుక్కుంటాయని వాళ్ళు అనుకునేవారట.