ఓటర్ల జాబితాతో ముడిపడిన కీలక సంస్కరణ దిశగా కేంద్ర సర్కారు అడుగులు వేస్తోంది. జనన, మరణాల వివరాలను ఓటర్ల జాబితాకు(Electoral Rolls) లింక్ చేసేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఒక వ్యక్తికి 18 ఏళ్లు నిండితే ఆటోమేటిక్ గా ఓటర్ల జాబితాలో(Electoral Rolls)అతడి పేరు చేరిపోయేలా.. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆటోమేటిక్ గా ఎన్నికల జాబితా నుంచి అతడి పేరు డిలీట్ అయ్యేలా అధునాతన సాంకేతికను వినియోగించాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం జనన, మరణ ధృవీకరణ పత్రాల సమాచారం స్టోర్ అయ్యే వ్యవస్థను.. ఓటర్ల జాబితాలు నిల్వ ఉండే వ్యవస్థతో టెక్నికల్ గా లింక్ చేయనున్నారని అంటున్నారు.
ALSO READ : Voter ID Aadhaar Link: ఓటర్ కార్డును ఆధార్ కార్డుకు ఎలా లింక్ చెయ్యాలో పూర్తి వివరాలు?
ఈ విధంగా ప్రత్యేక పద్ధతిలో జనన, మరణాల వివరాలు ఆటోమేటిక్ గా అప్ డేట్ అయితే.. జనాభా అవసరాలకు, సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి పనులను పక్కాగా ప్లాన్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ కార్యాలయం ‘జనగణన భవన్’ని ఢిల్లీలో ప్రారంభించిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వివరాలను వెల్లడించారు.