Crop Loan Waiver : పంటల రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్‌ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

  • Written By:
  • Updated On - July 15, 2024 / 04:18 PM IST

Telangana Crop Loan Waiver Scheme 2024 : తెలంగాణలో రూ. రెండు లక్షలలోపు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్‌ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతీ యూనిట్‌లో మొదట మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యత ప్రకారం రుణాలను మాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే, రుణమాఫీ అమలుకు రేషన్‌ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, చిన్న మొత్తంలో రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద అమౌంట్‌ను మాఫీ చేయనున్నారు. అలాగే.. రెండు లక్షల పైబడి ఉన్నా రుణాలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, రెన్యూవల్‌ చేసిన రుణలకు ఈ పథకం వర్తించదు. పీఎం కిసాన్‌ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రైతులకు రుణ మాఫీ వర్తిస్తుంది. ఇకపోతే, 12 డిసెంబర్‌ 2018 నుండి 9 డిసెంబర్‌ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది.

ప్రభుత్వం విడుదల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..

1. తెలంగాణలో భూమి క‌లిగి ఉన్న ప్ర‌తి రైతు కుటుంబానికి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ వ‌ర్తిస్తుంది.
2. ఈ ప‌థ‌కం స్వ‌ల్ప‌కాలిక పంట రుణాల‌కు వ‌ర్తిస్తుంది.
3. తెలంగాణ‌లో రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకులు.. వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.
4. 12.12.2018 తేదీన లేదా ఆ త‌ర్వాత మంజూరైన లేక రెన్యువ‌ల్ అయిన రుణాల‌కు, 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.
5. ఈ ప‌థ‌కం కింద ప్ర‌తి రైతు కుటుంబం రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పంట రుణ‌మాఫీకి అర్హులు. 09.12.2023 తేదీ నాటికి బ‌కాయి ఉన్న అస‌లు, వ‌ర్తింప‌య్యే వడ్డీ మొత్తం ప‌థ‌కానికి అర్హ‌త క‌లిగి ఉంటుంది.
5. రైతు కుటుంబం నిర్ణ‌యించ‌డానికి పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ వారు నిర్వ‌హించే ఆహార భ‌ద్ర‌త కార్డు(రేష‌న్ కార్డు) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. కాబ‌ట్టి అట్టి కుటుంబంలో ఇంటి య‌జ‌మాని జీవిత భాగ‌స్వామి పిల్ల‌లు మున్న‌గు వారు ఉంటారు.
6. అర్హ‌త గ‌ల రుణ‌మాఫీ మొత్తాన్ని డీబీటీ ప‌ద్ధ‌తిలో నేరుగా ల‌బ్దిదారుల రైతు రుణ‌ఖాతాల‌కు జ‌మ చేయ‌బ‌డుతుంది. పీఏసీఎస్ విష‌యంలో రుణ‌మాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుద‌ల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణ‌మాఫీ మొత్తాన్ని పీఏసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జ‌మ చేస్తారు.
7. ప్ర‌తి రైతు కుటుంబానికి 09.12.2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహ‌ణ క్ర‌మంలో రుణ‌మాఫీ మొత్తాన్ని జ‌మ చేయాలి.
8. ప్ర‌తి రైతు కుటుంబానికి 09.12.2023 నాటికి క‌లిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఏది త‌క్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హ‌త ఉంటుంది.
9. ఏ కుటుంబానికి అయితే రూ. 2 ల‌క్ష‌ల‌కు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ. 2 ల‌క్ష‌ల‌కు పైబ‌డి ఉన్న రుణాన్ని మొద‌ట బ్యాంకుల‌కు చెల్లించాలి. ఆ త‌ర్వాత అర్హ‌త గ‌ల రూ. 2 ల‌క్ష‌ల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాల‌కు బ‌దిలీ చేస్తారు.
10. రూ. 2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ రుణం ఉన్న ప‌రిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మ‌హిళ‌ల రుణాన్ని మొద‌ట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా ప‌ద్ధ‌తిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాల‌ను మాఫీ చేయాలి.

Read Also: KCR : సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తే కేసీఆర్ ఏం చేస్తారు..?

 

 

 

Follow us