Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

తాజాగా అమెరికాలో జూలై 4వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలలో ఒక దుండగుడు ఇండిపెండెన్స్‌ డే పరేడ్‌ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 03:50 PM IST

తాజాగా అమెరికాలో జూలై 4వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలలో ఒక దుండగుడు ఇండిపెండెన్స్‌ డే పరేడ్‌ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తదనంతరం ఒక నెటిజన్‌ జులై 4వ తేదికి సంబంధించిన కంటెంట్‌ కోసం వెతుకుతున్నప్పుడూ గూగుల్‌కి సంబంధించిన ప్రత్యేక సెలబ్రేషన్నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఐతే ఆ పేజిలో జులై 4న యూఎస్‌లో జరిగిన కాల్పులకు సంబంధించిన తాజా వార్తల పోటో లే అవుట్‌లతో పాటు కలర్‌ఫుల్‌ బాణ సంచాలతో రూపొందించింది.

అయితే ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పుడూ ఇలా బాణా సంచాలతో కలర్‌ ఫుల్‌గా ఇ‍వ్వకూడదు. షికాగోలోని ఐలాండ్‌ పార్క్‌లో జరిగిన సాముహిక కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన విషయం. కాల్పులు జరుగుతుండడంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీయడం వంటి బాధకరమైన వార్తలను ప్రజెంట్‌ చేస్తూ రంగరంగుల బాణాసంచా కాల్పుతో కలర్‌ఫుల్‌గా సంబరంలా ఇ‍వ్వడం పై పలువురు నెట్టిజల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ నెటిజన్స్ ఫిర్యాదులు చేశారు. అంతేకాదు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సుమారు 24 మం‍ది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే అలా చనిపోయిన వారికి గాయపడిన వారికి ఇవ్వాల్సిన నివాళి ఇదేనా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు సంబంధిత గూగుల్‌ యానిమేషన్‌ పేజీ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ విషయంపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.