Google Flights – Cheaper Tickets : చౌకగా ఫ్లైట్ టికెట్స్.. ‘గూగుల్ ఫ్లైట్స్’ సరికొత్త ఫీచర్

Google Flights - Cheaper Tickets :  గూగుల్ ఫ్లైట్స్ (Google Flights) లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది..

Published By: HashtagU Telugu Desk
Google Flights Cheaper Tickets

Google Flights Cheaper Tickets

Google Flights – Cheaper Tickets :  గూగుల్ ఫ్లైట్స్ (Google Flights)  మరో కొత్త ఫీచర్ ను ప్రకటించింది. దాని పేరు ‘గూగుల్ ఇన్ సైట్’ (Google Insight).. ఈ  ఫీచర్ ద్వారా విమాన టిక్కెట్‌లను చౌకగా, తక్కువ ధరలో బుక్ చేసుకోవడానికి సరైన సమయం ఏదనే సమాచారాన్ని వినియోగదారులకు గూగుల్ తెలియజేయనుంది. గూగుల్ ఫ్లైట్ సూచించిన టైంలో టికెట్ బుక్ చేసుకుంటే యూజర్స్ కు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. మీరు బుక్ చేయాలనుకుంటున్న విమానానికి సంబంధించిన టికెట్ ధరల హిస్టారికల్ డేటాను కూడా అందిస్తుంది. దానివల్ల టికెట్ ధర యావరేజ్ గా ఎంత ఉందనే దానిపై యూజర్ ఒక అంచనాకు రావచ్చు. విమానం బయలుదేరడానికి 1 నెల ముందు లేదా కొన్ని గంటల ముందు కూడా ‘గూగుల్ ఇన్ సైట్’ ఫీచర్ ద్వారా సమాచారాన్ని ఫిల్టర్ చేసుకొని మనం చూడొచ్చు.

Also read : Raksha Bandhan – Holy Stories : రాఖీ శక్తి తెలియాలంటే.. ఈ పురాణ కథలు తెలుసుకోండి

ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. తొలుత ఈ ఫీచర్ ను అమెరికా నుంచి యూరప్ దేశాలకు ఫ్లైట్ లో వెళ్లే వారికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దశలవారీగా అన్ని దేశాల నెటిజన్స్ కు ఈ ఫీచర్ అందేలా చేస్తారు. దీంతోపాటు ‘ప్రైస్ గ్యారంటీ ట్యాగ్’ (Google Flights – Cheaper Tickets) అనే మరో ఫీచర్ ను తేవడంపై కూడా గూగుల్ రీసెర్చ్ చేస్తోంది. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు టిక్కెట్ ధర ఒకే విధంగా ఉంటుందని భావించే విమానాల సమాచారాన్ని ఈ ఫీచర్ లో పొందుపరుస్తారు. ఒకవేళ మీరు Google ప్రస్తావించిన ధర కంటే తక్కువ ధరకు ఆ విమానానికి టిక్కెట్‌ను పొందగలిగితే.. అలాంటి ప్రయాణికుడి టికెట్ ఖర్చును గూగుల్ స్వయంగా భరిస్తుందట! ఈ ఫీచర్ డెవలప్మెంట్ ఇంకా తొలిదశలోనే ఉంది. ఇది విడుదల కావడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టొచ్చు.

  Last Updated: 30 Aug 2023, 10:17 AM IST