Google Doodle – India Textile Heritage : భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ గూగుల్ డూడుల్ క్రియేటివ్ గా శుభాకాంక్షలు చెప్పింది. భారత సంస్కృతీ సంప్రదాయాలను తన డూడుల్ తో గౌరవించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విభిన్న రకాల వస్త్ర ఉత్పత్తులను ఇవాళ డూడుల్ గా ప్రదర్శించింది. భారతదేశ ప్రజల వస్త్ర సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ ఇల్లస్ట్రేషన్ ను న్యూఢిల్లీకి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ నమ్రతా కుమార్ చిత్రీకరించారు.”ఈ ఆర్ట్ వర్క్ ద్వారా నేను భారతీయ వస్త్ర సంప్రదాయాల యొక్క సాంస్కృతిక వారసత్వం, కళాత్మకతను అందరికీ చూపించే ప్రయత్నం చేశాను” అని నమ్రతా కుమార్ చెప్పారు. “ఈ డూడుల్ లో ప్రదర్శించబడిన ప్రతి వస్త్రం.. నైపుణ్యం కలిగిన ఎంతోమంది కళాకారులు, చేనేత కార్మికులు, రంగులు వేసేవారు, ప్రింటర్లు, ఎంబ్రాయిడరీ నిపుణుల నైపుణ్యానికి నిదర్శనం.. వీరంతా కలిసి భారతదేశ సృజనాత్మక స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ అసాధారణ వస్త్రాలను సృష్టిస్తున్నారు” అని గూగుల్ పేర్కొంది.
గూగుల్ డూడుల్ (Google Doodle) లో ఉన్న వస్త్ర రకాలివీ..
గూగుల్ డూడుల్ లో ఈరోజు డిస్ ప్లే చేసిన ఇల్లస్ట్రేషన్ లో చోటు సంపాదించిన భారతదేశ వస్త్ర రకాల్లో .. కచ్ ఎంబ్రాయిడరీ (గుజరాత్), పట్టు వీవ్ (హిమాచల్ ప్రదేశ్), జమ్దానీ వీవ్ (పశ్చిమ బెంగాల్), కుంబీ వీవ్ టెక్స్‌టైల్ (గోవా), ఫైన్ ఇకత్ (ఒడిశా), పష్మీనా కనీ వీవ్ టెక్స్‌టైల్ (జమ్మూ కాశ్మీర్), బెనారసి వీవ్ (ఉత్తర ప్రదేశ్), పైథాని వీవ్ (మహారాష్ట్ర), కాంతా ఎంబ్రాయిడరీ (వెస్ట్ బెంగాల్), నాగా వోవెన్ టెక్స్‌టైల్ (నాగాలాండ్), అజ్రఖ్ బ్లాక్ ప్రింటింగ్ (కచ్-గుజరాత్), అపటానీ వీవ్ (అరుణాచల్ ప్రదేశ్), ఫుల్కారీ వీవ్ (పంజాబ్), లెహెరియా రెసిస్ట్ పంజాబ్ డైడ్ టెక్స్‌టైల్ (రాజస్థాన్), కంజీవరం (తమిళనాడు), సుజ్ని వీవ్ (బీహార్), బంధాని రెసిస్ట్ డైడ్ (గుజరాత్, రాజస్థాన్), కసావు వీవ్ టెక్స్‌టైల్ (కేరళ), ఇల్కల్ హ్యాండ్లూమ్ (కర్ణాటక), మేఖేలా చాదర్ వీవ్ (అస్సాం), కలంకారి బ్లాక్ ప్రింట్ (ఆంధ్రప్రదేశ్) ఉన్నాయి.
Also Read: Today Horoscope : ఆగస్టు 15 మంగళవారం రాశి ఫలితాలు.. వీరు ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి