Site icon HashtagU Telugu

Google Doodle – Cat Eye Frame : గుండ్రని కళ్లద్దాల ఫ్రేమ్లకు గుడ్ బై చెప్పిన క్రియేటివిటీ

Google Doodle Cat Eye Frame

Google Doodle Cat Eye Frame

Google Doodle – Cat Eye Frame : ఇవాళ గూగుల్ డూడుల్ ను చూశారా ? 

చూడకుంటే వెంటనే ఇక్కడ క్లిక్ చేసి .. దాన్ని చూడండి..  

ఒక కళ్లద్దాల ఫ్రేమ్ ను గూగుల్ ఈరోజు డూడుల్ గా డిస్ ప్లే చేసింది.. 

ఇంతకీ ఏమిటది ? 

ఈరోజు గూగుల్ డూడుల్ (Google Doodle) లో ఉన్న కళ్లద్దాల ఫ్రేమ్ “క్యాట్-ఐ”  మోడల్ కు చెందింది. దీన్ని ప్రసిద్ధ అమెరికన్ డిజైనర్ ఆల్టినా షినాసి (Altina Schinasi) రూపొందించారు.  ఇవాళ (ఆగస్టు 4) ఆల్టినా షినాసి 116వ పుట్టినరోజు. ఈసందర్భంగానే ఆమె డిజైన్ చేసిన ప్రఖ్యాత “క్యాట్-ఐ”  కళ్లద్దాల ఫ్రేమ్ ను డూడుల్ గా గూగుల్ డిస్ ప్లే చేసింది.

Also read : Miss Venezuela: రోడ్డు ప్రమాదంలో మిస్ వెనిజులా మృతి.. నిద్రమత్తే ప్రాణం తీసిందా..?

అలా మొదలై.. ఇలా మలుపు తిరిగింది 

వాస్తవానికి  ఆల్టినా షినాసి  కెరీర్ అనేది కళ్లద్దాల ఫ్రేమ్ డిజైనర్ గా మొదలుకాలేదు. చిన్నప్పటి నుంచి ఆమెకు పెయింటింగ్‌ అంటే ఎంతో ఇంట్రెస్ట్. తొలుత ఆమె క్లాత్ షో రూమ్స్ లో డ్రెస్ లను అద్దాలలో  చూడచక్కగా డిస్ ప్లే చేసే వర్క్స్ చేసేది.  ఈ పనిని టెక్నికల్ భాషలో “విండో డిస్‌ప్లే డిజైనింగ్” అంటారు.  ఇలా విండో డిస్‌ప్లే డిజైనర్ గా మొదలైన ఆల్టినా షినాసి కెరీర్ ఎన్నో మలుపులు తిరిగింది. ఈక్రమంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న  “ది ఆర్ట్ స్టూడెంట్స్ లీగ్‌”లో చేరి ఆమె తన కళాత్మక నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ సమయంలో ప్రముఖ ఆర్టిస్టులు సాల్వడార్ డాలీ, జార్జ్ గ్రోస్జ్ వంటి వారితో కలిసి పనిచేయడం  ద్వారా ఆల్టినా షినాసి కొత్తగా ఎంతో నేర్చుకున్నారు.  ఆ తర్వాతే “క్యాట్-ఐ” కళ్లద్దాల ఫ్రేమ్‌ ను డిజైన్ చేయాలనే క్రియేటివ్ ఆలోచన వచ్చింది.

Also read : Today Horoscope : ఆగస్టు 4 శుక్రవారం రాశి ఫలితాలు ఇవీ..  

కళ్లద్దాలు గుండ్రని ఫ్రేమ్‌లకే పరిమితం కావడాన్ని గమనించి.. 

కళ్లద్దాలు గుండ్రని ఫ్రేమ్‌లకే పరిమితం కావడాన్ని గమనించిన ఆల్టినా షినాసి.. ప్రత్యేకమైన ఫ్రేమ్ ను  డిజైన్ చేయాలని సంకల్పించారు. ఇటలీలోని వెనిస్‌లో జరిగిన కార్నెవాలే ఫెస్టివల్‌లో ధరించే హార్లెక్విన్ మాస్క్‌ల ఆకర్షణీయమైన  ఆకృతితో ప్రేరణ పొందిన ఆమె.. సరిగ్గా అదే లుక్ లో కళ్లద్దాల ఫ్రేమ్‌ కు తొలిసారిగా కాగితంపై  దృశ్య రూపం ఇచ్చింది. ఆల్టినా షినాసి తన  డిజైన్ ను న్యూయార్క్ లోని ఒక  స్థానిక  దుకాణ యజమానికి చూపించగా..  ఆరు నెలల పాటు ప్రత్యేకంగా ఆ డిజైన్ ను వాడుకునేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆల్టినా షినాసి డిజైన్ చేసిన “క్యాట్-ఐ” కళ్లద్దాల ఫ్రేమ్‌ నే “హార్లెక్విన్ కళ్లద్దాల మోడల్ ” అని కూడా పిలుస్తారు. ఈ ఆవిష్కరణతో  ఆమెకు  1939లో ప్రతిష్టాత్మక లార్డ్ & టేలర్ అమెరికన్ డిజైన్ అవార్డ్‌ వచ్చింది. వోగ్ అండ్ లైఫ్ వంటి ప్రఖ్యాత ప్రచురణ సంస్థలు కూడా ఫ్యాషన్ ప్రపంచానికి ఆల్టినా షినాసి చేసిన కృషిని అప్పట్లో ఎంతో కొనియాడాయి. “క్యాట్-ఐ” కళ్లద్దాల ఫ్రేమ్‌ 1939 నుంచి 1950 మధ్యకాలంలో అమెరికాలో ఫ్యాషన్ సంచలనంగా నిలిచింది.  దాదాపు 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ మోడల్ కళ్లద్దాల ఫ్రేమ్‌ కు జనాదరణ తగ్గలేదు. అందుకే ఆల్టినా షినాసి బర్త్ డే ను డూడుల్ రూపంలో గూగుల్ (Google) సెలబ్రేట్ చేసుకుంది.