24 Lakh For You : “బగ్” ఛాలెంజ్.. మీకోసమే 24 లక్షలు

24 Lakh For You : మీరు మొబైల్ యాప్స్ వాడేటప్పుడు .. వాటిని ఆపరేట్ చేసే క్రమంలో ఎక్కడైనా లోటుపాట్లు గుర్తించగలరా ? అయితే మీరే బగ్ హంటర్!! 

  • Written By:
  • Updated On - May 25, 2023 / 03:31 PM IST

24 Lakh For You : మీరు మొబైల్ యాప్స్ వాడేటప్పుడు .. వాటిని ఆపరేట్ చేసే క్రమంలో ఎక్కడైనా లోటుపాట్లు గుర్తించగలరా ? అయితే మీరే బగ్ హంటర్!!  ఇలాంటి వాళ్ళ కోసమే చాలా ఏళ్లుగా గూగుల్ బగ్ బౌంటీ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. బగ్ అంటే యాప్ లో ఉన్న లోపం.  బౌంటీ అంటే  బహుమానం. గూగుల్  యాప్స్ లోని బగ్స్ ను  గుర్తించి చెప్పే వాళ్లకు లక్షలాది రూపాయల రివార్డ్స్ ను ఇప్పటికే  గూగుల్  ఇస్తోంది. ఇప్పటివరకు ఈ అమౌంట్ ఎంత అనే దానిపై ఎవరికీ పూర్తి క్లారిటీ ఉండేది కాదు.. తాజాగా గూగుల్ వీటిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. గూగుల్ యాప్స్ లో ఏ రేంజ్ బగ్స్ గుర్తిస్తే.. ఎంత వరకు బౌంటీ ఇస్తారనేది వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్ తన ఆండ్రాయిడ్ యాప్‌లలో బగ్స్ గుర్తించే వాళ్లకు బహుమానం (24 Lakh For You) ఇచ్చేందుకు అనౌన్స్ చేసిన ప్రోగ్రాం పేరు.. “మొబైల్ వల్నరబిలిటీ రివార్డ్స్ ప్రోగ్రామ్ ” (మొబైల్ VRP). గూగుల్  డెవలప్ చేసిన లేదా గూగుల్ నిర్వహించే యాప్‌లలో బగ్స్  ను గుర్తించే వాళ్ళకి ఈ ప్రోగ్రాం కింద బహుమానం ఇస్తారు. తమ యాప్స్ లో  హెవీ రిస్క్ కలిగిన బగ్స్ ను దొరకబడితే రూ.62వేల నుంచి  రూ. 24 లక్షల వరకు(24 Lakh For You) రివార్డ్ ఇవ్వనుంది. అదనంగా రూ.80వేల బోనస్ కూడా ఇస్తుంది. ఇక మీడియం లెవల్ రిస్క్ కలిగిన బగ్స్ ను దొరకబడితే రూ.51వేల నుంచి  రూ.20లక్షల దాకా ఇస్తుంది. సాధారణ స్థాయి రిస్క్ కలిగించే బగ్స్ ను గుర్తించి చెబితే  రూ. 41 వేల నుంచి రూ. 16 లక్షల దాకా బౌంటీ ఇస్తుంది. మీరు  Facebook, Amazon, చాట్ జీపీటీ, Apple వంటి కంపెనీల బగ్స్ ను కూడా గుర్తించి ఇలా బౌంటీలు అందుకోవచ్చు. అయితే ఇందుకోసం కొంత టెక్నికల్  నాలెడ్జ్ అవసరం.

Also read : WhatsApp bug :అదంతా “బగ్” మాయ.. వాట్సాప్ తప్పు లేదు

భారతీయులే టాప్.. 

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కు సంబంధించిన బగ్ బౌంటీ ప్రోగ్రాంలో 2022 సంవత్సరంలో  700 మందికి పైగా పాల్గొన్నట్లు కంపెనీ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. రికార్డ్ స్థాయిలో 12 మిలియన్ డాలర్ల విలువైన బహుమతులను పరిశోధకులు గెలుచుకున్నట్లు వెల్లడించారు. బగ్ బౌంటీ చరిత్రలో ఇదే అతి పెద్ద రివార్డుగా పేర్కొన్నారు. ఈ మొత్తంలో ఎక్కువ భాగాన్ని భారతీయులే సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు.  వందలాది బగ్ లను గుర్తించిన అమన్ పాండే ఈ ప్రోగ్రాంలో టాప్ పరిశోధకుడిగా నిలిచినట్లు గూగుల్ రివార్డ్ టీమ్ కు చెందిన శారా జకోబస్ తెలిపారు. 2019 నుంచి 2022 డిసెంబర్ వరకు అమన్ పాండే దాదాపు 500 బగ్స్ ను ఆయన గూగుల్ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు.