Site icon HashtagU Telugu

ATM : ఇండియాలో ఏటీఎంలకు గుడ్‌బై చెప్పే రోజులు రాబోతున్నాయా..?

Cash Withdrawals

Cash Withdrawals

భారతదేశంలో ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా (Cash Withdrawal) చేసుకోవాలంటే ఇకపై మరింత ఖర్చవనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. మే 1 నుండి దేశవ్యాప్తంగా ఏటీఎం(ATM) నగదు ఉపసంహరణపై భారీగా ఛార్జీలను అమలు చేయబోతున్నారు. ఇకపై ప్రతి ఏటీఎం లావాదేవీపై వినియోగదారులు రూ. 23 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా రూ. 7 వసూలు చేయనున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాలు, వృద్ధులు, పింఛనుదారులు వంటి వారికి పెను భారం కానుంది.

ఇదే కాకుండా కొన్ని బ్యాంకుల వినియోగదారులు అదనపు ఛార్జీలకు కూడా సిద్ధంగా ఉండాలి. ఐడీఎఫ్‌సీ మరియు యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ బిల్లు చెల్లింపులపై 1% అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే,ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చెక్‌బుక్‌పై రూ. 200 వసూలు చేయనుంది. అందులో 50 చెక్కులు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం వినియోగదారులు నెలకు ఐదు ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే ఆ పరిమితిని దాటి ఏటీఎం ఉపయోగిస్తే అదనపు ఛార్జీలకు లోనవ్వాల్సి వస్తుంది.

LRS : ముగిసిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు

ఈ కొత్త నియమాలతో ప్రజలు తమ బ్యాంక్ లావాదేవీలపై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, బ్యాంకింగ్ సదుపాయాలు సరిగా లేని చోట, ప్రజలు ఈ విధానంపై మరింత అవగాహన పొందాలి. ప్రతి చిన్న లావాదేవీకి అధిక ఛార్జీలు పెట్టడం వల్ల నగదు లావాదేవీల స్థానంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం ప్రజలకు ఆర్థిక భారం అవుతుందా? లేక డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే మార్గమా? అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version