Site icon HashtagU Telugu

Life Hacks : డబ్బు సంపాదించడమే కాదు. ఇవి కూడా పాటించాలి.. లేదంటే?

Istockphoto 1049807888 612x612

Istockphoto 1049807888 612x612

మన చుట్టూ ఉన్న ఉన్నవారిలో సంపాదన శక్తి కలిగిన వారిలో ఎక్కువ మంది ని విచారించగా వారిలో చాలామంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఖచ్చితంగా చెబుతూ ఉంటారు. అయితే అందుకు గల కారణం వారి వద్ద ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే. సంపాదించిన డబ్బును ఎలా వినియోగించుకోవాలి అన్న స్పష్టత లేక పోవడమే. మరి డబ్బు సంపాదించడంతో పాటుగా ఆ డబ్బును ఎలా వినియోగించుకోవాలి. వచ్చే ప్రతి రూపాయి ని ఎలా వాడుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తున్న వారు అక్కడితో సరిపెట్టుకోకుండా ఇంకా సంపాదించాలి.. మరింత ఎత్తుకు ఎదగాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు.

అలాంటప్పుడు ఇప్పటివరకూ మీరు సంపాదించినది లేదా సంపాదిస్తుంది సంతృప్తికరంగా ఉందా లేదా అన్న ప్రశ్నల వేసుకోవాలి. కాబట్టి ఎంత సంపాదించినా కూడా ఉన్న దానితో సంతృప్తి చెందడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరి కుటుంబాలకు తగ్గట్టుగా వారి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ సమగ్రమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం సంపాదిస్తున్న డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా పొదుపు,రుణాలు,ఈఎంఐలు ఇలా ఇలా కట్టుకుంటూ సేవింగ్స్ చేసుకోవాలి.

చాలామంది ఇలా ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల వచ్చిన ఆదాయం వచ్చినట్లు పోవడంతో ఆదాయం ఏమాత్రం చాలడం లేదని కూడా చెబుతుంటారు. మరొక ముఖ్యమైన విషయం టైం మేనేజ్మెంట్. కాలం చాలా పవర్ ఫుల్. ఏ ఒక్కరి కోసం ఒక సెకను కూడా ఆగదు. అలాగే మనిషి జీవితం కూడా అంతే. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదాయం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా సమయం వృధా అయ్యే పనులకు చోటు కల్పిస్తూ ఉంటారు. ఇక చాలామంది వారు సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి వారు సంపాదించిన దానితో పోలిస్తే ఖర్చులను చాలావరకు తగ్గించుకోవడం వల్ల మనం సంపాదించిన డబ్బును అంతో ఇంతో దాచి పెట్టుకోవచ్చు.

Exit mobile version