Site icon HashtagU Telugu

Gold Tips : బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. వారంలో భారీగా తగ్గిన ధర?

8cfb6165 2fb5 4231 847e 43051979c654

8cfb6165 2fb5 4231 847e 43051979c654

ప్రస్తుత రోజుల్లో బంగారం కొనుగోలు చేయాలి అంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. బంగారం ధర రోజు రోజుకి ఆకాశం అందుకునే తప్ప తగ్గడం లేదు. దీంతో పసిడి ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పసిడి ప్రేమికులకు ఒక చక్కటి శుభవార్త. అదేమిటంటే బంగారం ధరలు కాస్త శాంతించాయి. గడిచిన వారం రోజుల్లో తులం బంగారం ధర వెయ్యి రూపాయల వరకు తగ్గింది. ఆగస్టు నెల కు సంబంధించి పది గ్రాముల బంగారం ఫ్యూచర్స్ కాంటాక్ట్ ధర రూ.50, 603 కు చేరుకుంది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1826 డాలర్ల దగ్గర ఉంది. ఒక ఔన్స్ 28.34 గ్రాములకు సమానం.

బంగారానికి తక్షణం 1810 డాలర్ల మద్దతు పసిడికి తక్షణం 1810 డాలర్ల మద్దతు ఉన్నట్టు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీని తర్వాత బలమైన మద్దతు 1770 డాలర్ల వద్ద ఉందని అంటున్నారు. ఎంసీఎక్స్ లో బంగారానికి తక్షణ మద్దతు రూ.49,900 వద్ద ఉంటే, ఆ తర్వాత రూ.49,200 వద్ద ఉందని చెబుతున్నారు. ఇకపోతే ఇటీవలి వారాల్లో వరుసగా బంగారం ధరలు పెరిగినందున కొంత శాంతించాయి. డాలర్ రెండు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కేంద్ర బ్యాంకులు రేట్ల పెంపును అనుసరిస్తున్నాయి.

అయితే, ఆర్థిక మందగమనం ఆందోళనల నేపథ్యంలో బంగారం ధరలు ఇక్కడి నుంచి పెద్దగా తగ్గే అవకాశం కనిపించడం లేదు. అందుకు గల కారణం బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా చూస్తారు కనుక అని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ విపుల్ శ్రీవాస్తవ తెలిపారు. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా స్పందిస్తూ..వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాలు బంగారం, వెండి ధరలపై ఒత్తిడికి దారితీశాయి. అయితే రూపాయి బలహీనపడడం బంగారం, వెండి ధరలకు మద్దతునిచ్చే అంశం అని తెలిపారు.