Gold Rate: ముచ్చెమటలు పట్టిస్తున్న వెండి బంగారం ధరలు.. ఏకంగా అన్ని రూ.వేలా?

దేశవ్యాప్తంగా రోజురోజుకి మార్కెట్ లో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో

  • Written By:
  • Publish Date - April 5, 2023 / 04:19 PM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకి మార్కెట్ లో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయాలి అంటేనే భయపడుతున్నారు. అంతే కాకుండా బంగారం తగ్గుతుంది అనుకుంటున్నా కొద్ది అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బంగారం పేరు వింటేనే కొంతమంది హడలెత్తిపోతున్నారు. బాబోయ్ బంగారమా ఇప్పట్లో మనం కొనలేము అంటూ చేతులెత్తేస్తున్నారు.

చాలామంది పసిడి ప్రేమికులు సైతం బంగారం పై ఆశలు వదిలేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా పసిడి ధరలు అలాగే వెండి ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు బంగారం కొనాలి అంటేనే ఆలోచిస్తున్నారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఇక తాజాగా బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయానికి వస్తే.. దేశంలో పలు నగరాల్లో బంగారం ధర రూ.61 వేలను దాటేసింది. అటు వెండి కూడా ఇదే బాటలో ప్రయాణిస్తోంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు పై రూ. 10 పెరిగి రూ. 55,310కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు పై రూ.19 పెరిగి రూ.69,340కి చేరుకుంది.

హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,300 కి, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1000 రూపాయలు పెరిగి రూ.60,330 కి చేరుకుంది. ఇక ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,360 గా ఉంది. అలాగే ఢిల్లీలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61, 510 గా ఉంది. ఇకపోతే హైదరాబాద్‌లో మరో విలువైన లోహం వెండి ధరలను పరిశీలిస్తే కేజీ వెండి ఏకంగా రూ. 2900 పుంజుకుంది. కిలో ధర రూ.77800గా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. బలహీనమైన అమెరికా ఆర్థిక డేటాతో ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీ రేటు వడ్డన ఆందోళనతో గోల్డ్‌ ఔన్సు 2వేల డాలర్లు అధిగమించింది. తద్వారా ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎంసీక్స్‌ గోల్డ్ బుధవారం రూ. 61,130 వద్ద ఉంది. కిలో వెండి 3.7 శాతం ఎగిసి రూ. 74,700 కి స్థాయిని తాకింది.