Site icon HashtagU Telugu

Gold ATM: హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎం, ఎగబడుతున్న పసిడి ప్రియులు

Gold ATM

Gold Atm

Gold ATM: సాధారణంగా ఏటీఎంలు అంటే దాని నుంచి నగదు తీసుకోవడమే. అయితే బంగారాన్ని విత్‌డ్రా చేసుకునే ఏటీఎంల గురించి ఎప్పుడైనా విన్నారా? అవును ఇప్పుడు అది సాధ్యమే. గోల్డ్ కాయిన్స్ మెట్రో ప్రయాణికుల ఉపయోగం కోసం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో రియల్ టైమ్ గోల్డ్ ATM  ఏర్పాటైంది. ఈ ఏటీఎంలో ప్రజలు 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల బంగారాన్ని నాణేల రూపంలో తీసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా UPI చెల్లింపు ద్వారా ఈ బంగారు ATMలో బంగారం, వెండి నాణేలను తీసుకునే విధంగా ఈ ATM రూపొందించబడింది.

కస్టమర్ల నుంచి ఊహించిన దానికంటే మెరుగైన స్పందన వచ్చిందని గోల్డ్ సిక్కా లిమిటెడ్ యాజమాన్యం తెలిపింది. వినూత్న విధానం వినియోగదారులకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. మొదటి మెషీన్‌లా కాకుండా గోల్డ్ ఏటీఎం వెర్షన్-2లో మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు బంగారం, వెండి నాణేలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గోల్డ్‌సిక్కా సీఈవో సై తరుజ్‌ మాట్లాడుతూ.. గతేడాది బేగంపేటలో తొలి మెషీన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ATM ఈ కొత్త వెర్షన్ 0.5 గ్రాములు, 1 గ్రాము, 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల నుండి బంగారు నాణేలు, 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాములు మరియు 100 గ్రాముల నుండి వెండిని డ్రా చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.

Exit mobile version