Marilyn Monroe As Kali: హాలీవుడ్ నటిలా కాళీమాత, ఉక్రెయిన్ కంట్రీపై ఇండియన్స్ ఫైర్!

ఉక్రెయిన్ కంట్రీ భారత్ ను కించపర్చేలా వ్యవహరించింది. భారత ప్రజల (Indians) మనోభావాలు దెబ్బతీసే పనికి ఒడిగట్టింది.

Published By: HashtagU Telugu Desk
Kali

Kali

ఉక్రెయిన్ (Ukraine), రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. నేటికీ ఏదో ఒక అంశంలో రెండు దేశాల మధ్య యుద్ధం (War) తలెత్తుతున్నాయి. అయితే ఈ రెండు దేశాల యుద్ధ పరిస్థితులపై ఇండియా తటస్థంగా వ్యవహరించింది. అయితే సడన్ గా ఏమైందో ఏమో కానీ ఉక్రెయిన్ కంట్రీ భారత్ ను కించపర్చేలా వ్యవహరించింది. భారత ప్రజల (Indians) మనోభావాలు దెబ్బతీసే పనికి ఒడిగట్టింది. హిందువులు ఆరాధించే కాళీమాత (Kali) ఫొటోను అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ చేసింది.

కాళీమాతను హాలీవుడ్ (Hollywood) నటి మార్లిన్ మ‌న్రోతో పోల్చుతూ రెండు ఫొటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తొలి ఫొటోలో బాంబు దాడి అనంతరం సంభవించే అగ్ని, దట్టమైన పొగ దృశ్యాలున్నాయి. మరో ఫొటోలో దట్టమైన పొగంతా అగ్ని అంతా జుత్తుగా మారిపోయినట్లుగా ఉన్న కాళీమాత ఫొటో ఉంది.

నాలుక బయటకు తెరిచి.. పుర్రెలను మాలగా వేసుకున్న కాళీమాత ఫొటో చూస్తే మార్లిన్ మ‌న్రోయే స్ఫురణకు వచ్చేవిధంగా అభ్యంతరకరంగా ఉంది. ‘వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు సోషల్ మీడియా (Social Media) లో చక్కర్లు కొడుతున్నాయి. ఉక్రెయిన్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారతీయులు వరుస పోస్టులు పెడుతూ ఆ దేశంపై మండిపడుతున్నారు. ఈ విషయం భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఉక్రెయిన్ ఢిఫెన్సీ మినిస్ట్రీని మందలించినట్టు తెలుస్తోంది.

Also Read: Bhola Shankar Look: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. వింటేజ్ లుక్స్ అదుర్స్

  Last Updated: 02 May 2023, 10:14 AM IST