Uttam Kumar : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు చట్ట విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర సాగునీటి పరిరక్షణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్‌కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పాటిల్ ఈ అంశాలను గమనించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Read Also: YS Sharmila: జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల
ఈ సందర్భంగా కృష్ణా వాటాలపై నిర్ణయం తీసుకోవాల్సిన ట్రైబ్యునల్ తీర్పు త్వరగా రావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. తెలంగాణకు న్యాయం జరిగేలా, జలవివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వెలువడేలా చూడమని విజ్ఞప్తి చేశాం అని పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్‌కు నీరు తరలించే అవకాశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నాం. ఈ అంశంపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య త్వరలో సమావేశం జరగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు అని వెల్లడించారు.
కేంద్రం నుంచి ఇంకా అనుమతుల్లేక తెలంగాణలోని పలు ప్రాజెక్టులు ఆగిపోయినట్లు తెలిపారు. ఏపీ ప్రాజెక్టులకు మాత్రం వేగంగా అనుమతులు మంజూరు అవుతున్నాయి. ఇది స్తబ్దతకు గురైనతెలంగాణ ప్రాజెక్టుల పట్ల వివక్షకు నిదర్శనం అని ఆయన అన్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాం. అలాగే పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మడిహట్టు వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేపట్టాలని విజ్ఞప్తి చేశాం అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో సమానత్వంతో, న్యాయబద్ధంగా కేంద్రం నడుచుకోవాలని కోరారు. రాష్ట్రానికి వాటా వచ్చిన నీటిని ఉపయోగించుకోవడమే తమ హక్కు అని, ఇది కొంతమంది తప్పుగా భావిస్తే సహించేది కాదని హెచ్చరించారు.
Read Also: Baba Vanga Prediction : స్మార్ట్‌ఫోన్ యుగం తో సమస్యలు తప్పవని కొన్ని ఏళ్ల క్రితమే బాబా వంగా జోస్యం