Site icon HashtagU Telugu

Glucan-D: రోగనిరోధక శక్తిని పెంచడానికి ‘ఎనర్జీ కా గోలా’ కార్యక్రమం..

Glucon-D: 'Energy Ka Gola' program to boost immunity..

Glucon-D: 'Energy Ka Gola' program to boost immunity..

Glucan-D: హైదరాబాద్ అధిక తేమ, భారీ వర్షాలు, వేడిగాలుల మధ్య ఊగిసలాడుతున్న తరుణంలో, భారతదేశ అత్యంత విశ్వసనీయమైన గ్లూకోజ్ ఆధారిత ఎనర్జీ డ్రింక్ అయిన గ్లూకాన్-డి, లక్నో, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలలో 10,000 మందికి పైగా పిల్లలకు అలసటను ఎదుర్కోవడానికి మరియు చురుకైన దినచర్యలు, వేగంగా హెచ్చుతగ్గులతో మారుతున్న వాతావరణం మధ్య రోగనిరోధక శక్తిని పెంచడానికి ‘ఎనర్జీ కా గోలా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం సంప్రదాయ భారతీయ గోలాను ఒక ఉద్దేశపూర్వక ఇంటర్వెన్షన్‌గా చేస్తుంది. నారింజ, మామిడి, నింబు పానీ వంటి ప్రసిద్ధ రుచులలో గ్లూకాన్-డితో నింపబడిన 700 కిలోలకు పైగా చిల్డ్ గోలాలను 100 కి పైగా ఆట స్థలాలు మరియు స్టేడియంలలో అందిస్తున్నారు. ఇది ఆటలలో నిమగ్నమైన పిల్లలలో శక్తిని నింపడంలో సహాయపడుతుంది.

వేసవిలో పిల్లల సంరక్షణలో ఉన్న లోపాన్ని పూడ్చడమే ఎనర్జీ కా గోలా లక్ష్యం. వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులలో శారీరక శ్రమ గ్లూకోజ్ వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. నీళ్లు తాగడం అనేది హైడ్రేషన్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ, ముఖ్యంగా యువ, చురుకైన వ్యక్తులలో శక్తి స్థాయిలను పూర్తిగా పున రుద్ధరించడానికి ఇది సరిపోకపోవచ్చు. గ్లూకోజ్, విటమిన్ సితో నిండిన గ్లూకాన్ డి రక్తప్రవాహంలోకి వేగంగా శోషించబడుతుంది. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తికి ప్రభావవంతమైన వనరుగా మారు తుంది. వేడి మరియు తేమతో కూడిన తడి పరిస్థితులలో దీని పాత్ర మరింత ముఖ్యమైనది. ఇలాంటి చోట చెమట మరియు శక్తి నష్టం కొనసాగుతాయి మరియు పిల్లలలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో, ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం ఇందిరా పార్క్ స్టేడియం, చింతల్ బస్తీ ప్లే గ్రౌండ్, తిరుమలగేరి ఫుట్‌బాల్ గ్రౌండ్, భువన విజయం గ్రౌండ్స్ మైదానాలు వంటి కీలకమైన ప్రదేశాలలో చురుగ్గా జరుగుతోంది. ఈ క్యాంపెయిన్ జరిగే ఇతర నగరాల్లో కూడా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి.

“వేసవి వాతావరణం తీవ్ర పరిస్థితుల మధ్య మారుతున్నందున, పిల్లల శ్రేయస్సు పట్ల మన విధానం కూడా అంతే వేగంగా మారాలి” అని జైడస్ వెల్నెస్ సిఇఒ తరుణ్ అరోరా అన్నారు. దశాబ్దాలుగా ఇంటింటికి విశ్వ సనీయమైన పేరుగా ఉన్న గ్లూకాన్-డి, అవసరమైనప్పుడు తక్షణ శక్తి, రోగనిరోధక శక్తిని అందిస్తూనే ఉంది. ఎనర్జీ కా గోలాతో, మేము సైన్స్‌తో నోస్టాల్జియాను మిళితం చేసి సకాలంలో అందుబాటులో ఉండే ఉత్పత్తిని అందిస్తున్నాం. ఇది వారసత్వంగా పాతుకుపోయినప్పటికీ నేటి వేసవి సవాళ్ల కోసం తిరిగి ప్రత్యేకంగా రూపొం దించబడింది. ఇది భారతదేశ పిల్లల శక్తి మరియు స్థితిస్థాపకతకు ఇంథనం నింపడానికి మాకు గల శాశ్వత నిబద్ధతకు ప్రతిబింబం’’ అని అన్నారు. తక్షణ శక్తి ప్రాముఖ్యతను చాటిచెప్పడానికి, ప్రజల్లో ఈ క్యాంపెయిన్ పరిధిని విస్తరించడానికి thefoodie rider_hyderabad, mrs_eattri, food machaaa వంటి స్థానిక ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ ప్రయ త్నంలో చేరారు. భారతదేశంలో వేసవికాలం ముమ్మరమవుతోంది. కొన్ని ప్రాంతాలు వేడి తరంగాల తీవ్రతను ఎదుర్కొనేం దుకు సిద్ధమవుతుండగా, మరికొన్ని ప్రాంతాలు వర్షాలు, ఉరుములతో కూడిన తుఫానులను ఎదుర్కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో, గ్లూకాన్-డి రియల్ టైమ్‌లో వివిధ ప్రాంతాలలో మరియు రోజువారీ మార్గాల్లో ప్రజల శ్రేయస్సుకు మద్దతు ఇస్తోంది.