Site icon HashtagU Telugu

Lakshadweep : అంత లక్షద్వీప్ వైపే చూస్తున్నారట..ఇదంతా మోడీ మాయే..!!

Lakshadweep Modi

Lakshadweep Modi

ఏ క్షణాన భారత ప్రధాని మోడీ (Modi) లక్షద్వీప్ (Lakshadweep ) పర్యటన చేసి..దానికి సంబదించిన విశేషాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారో..అప్పటి నుండి ప్రతి ఒక్కరు లక్షద్వీప్ గురించి సెర్చ్ (Search) చేయడం మొదలుపెట్టారు..లక్షద్వీప్ అరేబియా సముద్రం మధ్యలో ఉన్న ఓ స్వర్గం. ఇక్కడికి ప్రతిఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.

భారతదేశంలో అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కి.మీ, కేరళ తీరంనుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్జీవ దీవులు. ఇవేకాక ఇంకా లెక్కలోకి తీసుకోని ఎన్నో చిన్న దీపఖండాలున్నాయి. లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి నగరం. లక్షద్వీప్‌లో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది. కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యం ఉంది. ఈ దీవుల ప్రజలు మళయాళ మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తం జనాభా ముస్లిం మతస్తులు. తమ పూర్వీకులు ఒక పెద్ద తుఫాను వలన సముద్రములో ఈ దీవులకు కొట్టుకువచ్చిన కొందరు వర్తకులని ఇక్కడి వాసుల నమ్మకం.

అలాంటి ఈ దీవికి ప్రధాని మోడీ ఈ నెల 3,4 తేదీల్లో పర్యటించారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అవి కాస్త వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ తర్వాత ఈ దీవి కోసం..అక్కడికి ఎలా వెళ్లాలి మొదలగు విషయాల గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఏంతలా అంటే లక్షద్వీప్‌ గురించి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌మైట్రిప్‌లో వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగింది. ఈ మేరకు MakeMyTrip సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో సోమవారం పోస్ట్ చేసి ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ప్రధాని పర్యటన తర్వాత ఈ ద్వీపసమూహం గురించి ఊహించినట్లుగానే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శోధించినట్లు తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

మీరు కూడా లక్షద్వీప్ వెళ్లాలని భావిస్తే కొచ్చి కంటే మంగళూరు పోర్టు ద్వారా కూడా వెళ్లొచ్చు. అంటే తెలుగు రాష్ట్రాల్లోని వారు ముందుగా మంగళూరుకు వెళ్లాలి. అక్కడి నుంచి తక్కువ ఖర్చుతోనే లక్షద్వీప్‌కు వెళ్లొచ్చు. ఇప్పుడు మంగళూరు పోర్టు ద్వారానే పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు లక్షద్వీప్‌కు వెళ్తున్నాయి. మీరు ఈ పోర్ట్‌కు వెలితే అక్కడి నుంచి సులభంగా లక్ష ద్వీప్‌కు వెళ్లొచ్చు. మోడీ పర్యటన కు ముందు వరకు చాలామంది సినీ ప్రముఖులు , బిజినెస్ రంగాల వారు , క్రీడాకారులు ఇలా చాలామంది ఎక్కువగా మాల్దీవులకు వెళ్లేవారు. గత నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత అనుకూల ప్రభుత్వం మారిపోయి.. చైనా అనుకూల, భారత వ్యతిరేక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటినుంచి భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు కాస్త చెడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ పర్యటనపై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసారు మాల్దీవులకు చెందిన ఓ ఎంపీ. ఈ వ్యాఖ్యలతో మరింత దూరం పెరిగినట్లు అయ్యింది. ఎంపీ మాటలతో చాలామంది బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో #BoycottMaldives అనే హ్యాష్‌ట్యాగ్ నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. మరోవైపు.. ఇప్పటికే మాల్దీవులు వెళ్లేందుకు ట్రిప్‌ బుక్ చేసుకున్న వారు ఆ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ జాబితాలోకి సెలెబ్రిటీలు కూడా ఉన్నారు.

భారతీయులపై ద్వేషపూరిత, జాత్యహంకార వ్యాఖ్యలు మాల్దీవులకు చెందిన రాజకీయ నాయకులు చేస్తున్నారని.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మాల్దీవులకు అధిక సంఖ్యలో పర్యాటకులు పంపించే భారత్ పట్ల వాళ్లు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు. మొత్తం మీద ఇప్పుడు లక్షద్వీప్‌ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

Read Also : CM Revanth: ములుగు జిల్లాకు రేవంత్ గుడ్ న్యూస్, 750 కార్మిక కుటుంబాలకు ఉపాధి