తనను తానే పెళ్లాడిన గుజరాత్ యువతి మరోసారి వార్తల్లో నిలిచింది. గుజరాత్ కు చెందిన క్షమాబిందు ఈ ఏడాది జూన్ లో తనను తానే వివాహం చేసుకుంది. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో టాపిగ్గా మారింది. అయితే ఇప్పుడు క్షమాబిందు ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసి మరోసారి వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే…కర్వాచౌత్ జరుపుకున్న ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ చీరలో చేతిలో జల్లెడ పట్టుకుని కనిపిచింది. జల్లెడలో తానను తానే చూసుకుంది.
ఈ రోజు మొదటి కర్వా చౌత్ జరుపుకున్నాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నారు. కోల్పోయిన నా గర్వాన్ని చూశాను హ్యాపీ కర్వా చౌత్ అని క్యాప్షన్ జోడించింది. ఇప్పుడా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.