GKB : రే-బాన్ మెటా AI గ్లాసెస్‌ను ప్రారంభించిన GKB ఆప్టికల్స్

ఈ అద్భుతమైన ఆవిష్కరణ ఇప్పుడు GKB ఆప్టికల్స్‌లో అందుబాటులో ఉంది. రే-బాన్ మెటా AI గ్లాసెస్ వినూత్న హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులు ఫోటోలు, వీడియోలను సులభంగా తీయగలరు, సంగీతం వినగలరు, కాల్స్ నిర్వహించగలరు, అలాగే తమ ఐవేర్ ద్వారా నేరుగా మెటా AIతో సంభాషించవచ్చు.

Published By: HashtagU Telugu Desk
GKB Opticals launches Ray-Ban Meta AI glasses

GKB Opticals launches Ray-Ban Meta AI glasses

GKB : GKB ఆప్టికల్స్, భారతదేశంలోని ప్రముఖ ప్రీమియం ఐవేర్ రిటైల్ చైన్, దేశవ్యాప్తంగా తన GKB స్టోర్లలో విప్లవాత్మకమైన రే-బాన్ మెటా AI గ్లాసెస్‌ను ప్రారంభించిందని గర్వంగా ప్రకటిస్తోంది. రే-బాన్ మరియు మెటా సంస్థలు కలిసి రూపొందించిన ఈ ఆధునిక వేరబుల్ టెక్నాలజీ, అధునాతన AI-ఆధారిత ఫీచర్లను ఐకానిక్ శైలితో సమన్వయ పరిచింది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ ఇప్పుడు GKB ఆప్టికల్స్‌లో అందుబాటులో ఉంది. రే-బాన్ మెటా AI గ్లాసెస్ వినూత్న హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులు ఫోటోలు, వీడియోలను సులభంగా తీయగలరు, సంగీతం వినగలరు, కాల్స్ నిర్వహించగలరు, అలాగే తమ ఐవేర్ ద్వారా నేరుగా మెటా AIతో సంభాషించవచ్చు. ఈ ఆధునిక ఉత్పత్తిని తన తెలివైన వినియోగదారులకు అందించే భారతదేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఒకటిగా GKB ఆప్టికల్స్ నిలిచింది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా  శ్రేమతి ప్రియాంక గుప్తా, ఆప్టికల్స్ డైరెక్టర్, GKB ఇమాట్లాడుతూ..“భారత మార్కెట్లో రే-బాన్ మెటా AI గ్లాసెస్‌ను ప్రవేశపెట్టడం మా సంస్థకు గర్వకారణంగా ఉంది. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా కళ్లజోడు రంగంలో తాజా టెక్నాలజీని అందిస్తూ, ఆధునిక సాంకేతిక దృష్టిని సమన్వయ పరిచిన స్మార్ట్ లివింగ్ భవిష్యత్తుకు మా కస్టమర్లకు అసమానమైన ప్రాప్యతను అందించడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న GKB ఆప్టికల్స్ స్టోర్లలో వినియోగదారులు ఇప్పుడు రే-బాన్ మెటా AI గ్లాసెస్‌కు సంబంధించిన ప్రత్యక్ష డెమోను ఎక్స్పీఎరియన్స్ చేయడమే కాకుండా, మెటా కలెక్షన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఉత్పత్తులు ముంబై, బెంగళూరు, NCR, కోల్‌కతా, చెన్నై, చండీగఢ్, జైపూర్, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే తదితర ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

Read Also: Theatres Bandh Issue : రాజమండ్రి జనసేన ఇంచార్జ్ పై వేటు

  Last Updated: 27 May 2025, 06:12 PM IST