Grandson Or Rs 5 Cr: ఏడాదిలోగా వంశంకురాన్ని కనండి.. లేదంటే రూ.5 కోట్ల పరిహారం కట్టండి : కొడుకు,కోడలిపై కోర్టుకెక్కిన ఓ తల్లి

" కేసులందు.. ఇలాంటి కేసులు వేరయా" అనే విధంగా ఒక వింత కేసు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ సివిల్ కోర్టులో నమోదైంది.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 04:50 PM IST

” కేసులందు.. ఇలాంటి కేసులు వేరయా” అనే విధంగా ఒక వింత కేసు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ సివిల్ కోర్టులో నమోదైంది. “ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏడాది తిరిగేలోగా నా చేతిలో మనవడినో, మనవరాలినో పెట్టాల్సిందే. అలా చేయలేని పక్షంలో రూ.5 కోట్ల పరిహారాన్ని నాకు కట్టాల్సిందే” అని హెచ్చరిస్తూ ఒక తల్లి తన కొడుకు, కోడళ్ల పై కోర్టులో దావా వేసింది. 2016లో కొడుకు కు తన సొంత డబ్బుతో పెళ్లి చేసి, హనీమూన్ కోసం థాయ్ ల్యాండ్ కు పంపానని ఆమె పేర్కొంది.

గత ఐదారేళ్లుగా వంశంకురాన్ని చూసే అదృష్టం దక్కక మానసికంగా కుమిలిపోతున్నానని పిటిషన్ లో తెలిపింది. తన ఏకైక కోరికను నెరవేర్చలేకపోతే కొడుకు, కోడలు నుంచి రూ.5 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని ఆ మాతృమూర్తి కోర్టుకు విజ్ఞప్తి చేసింది. పెళ్లి కాగానే కొడుకు తన కోడలి మాట విని హైదరాబాద్ కు మకాం మార్చాడని వివరించింది. తన కొడుకు సంపాదనపై పూర్తిగా కోడలు తరఫు వాళ్లే పెత్తనం చలాయిస్తున్నారని ఆరోపించింది. ఏడాదిలోగా పిల్లల్ని కనేలా కొడుకు, కోడలిని ఆదేశించాలని న్యాయస్థానాన్ని వేడుకుంది.