Ghost And Soul : దెయ్యంగా మారే ఆత్మల లోగుట్టు ఇదీ..

పుట్టుక.. చావు.. పునర్జన్మ.. ఆత్మలు..  దెయ్యాలు.. ప్రేతాత్మలు..స్వర్గం.. నరకం.. ఈ టాపిక్స్ (Ghost And Soul) గురించి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది.

  • Written By:
  • Updated On - May 24, 2023 / 10:06 AM IST

పుట్టుక.. చావు.. పునర్జన్మ.. ఆత్మలు..  దెయ్యాలు.. ప్రేతాత్మలు..స్వర్గం.. నరకం.. ఈ టాపిక్స్ (Ghost And Soul) గురించి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీటి గురించి ఒక క్లారిటీ ఉన్నవాళ్లు బతికి ఉన్నన్ని నాళ్ళు ఆదర్శవంతంగా జీవిస్తారు. ఎందుకంటే .. వారికి చనిపోయాక ఎదురయ్యే పరిస్థితుల గురించి.. స్వర్గ, నరకాల గురించి క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఇటువంటి విషయాలు(Ghost And Soul) తెలుసుకోవాలని భావించే వారు తప్పకుండా చదవాల్సినది “గరుడ పురాణం” !! ఇది హిందూ మతంలోని 18 మహా పురాణాలలో ఒకటి.   ఈరోజు మనం “గరుడ పురాణం”లో  ప్రేతాత్మలు.. దెయ్యాల ప్రస్తావన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. 

భూమిపై దుర్మార్గుల్లా ప్రవర్తించిన వాళ్ళ  ఆత్మలు..

గరుడ పురాణంలో ధర్మం-అధర్మం, పాపం-పుణ్యం, స్వర్గం-నరకం, జ్ఞానం-అజ్ఞానం గురించి డీటెయిల్డ్ గా ఉంది. దీని ప్రకారం.. చనిపోయిన తరువాత కొన్ని ఆత్మలు మ‌ళ్లీ మాన‌వ జ‌న్మ పొందుతాయి. మరికొన్ని దెయ్యాలుగా మార‌తాయి. అయితే ఏ ఆత్మలు దెయ్యాలుగా, ప్రేతాత్మలుగా మారి తిరుగుతాయి ? ఎందుకు అవి  అలా మారుతాయి ? అనే ప్రశ్నలకు  గరుడ పురాణంలో ఆన్సర్స్ ఉన్నాయి. శ్రీ మ‌హావిష్ణువు త‌న వాహ‌న‌మైన‌ పక్షిరాజు గరుడుడికి మరణం గురించి చెప్పిన వివరణలో వీటి ప్రస్తావన ఉంటుంది.ఎవరైనా ప్రాణాలు విడిచిన తరువాత .. వారి ఆత్మకు ఏదైనా మరో రూపంలో పునర్జన్మ లభిస్తుంది. అయితే అతడికి లభించే పునర్జన్మ అనేది..  జీవితకాలంలో చేసిన‌ పనులపై ఆధారపడి ఉంటుంది. భూమిపై దుర్మార్గుల్లా ప్రవర్తించిన వాళ్ళ  ఆత్మలు మృత్యులోకంలో సంచరిస్తాయి.

also read : Suicidal Deaths: పౌర్ణమి వారంలో ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? షాకింగ్ విషయాలు వెల్లడి..!

అలాంటి ఆత్మలు ఏం చేస్తాయంటే..

ప్రమాదం, హత్య, ఆత్మహత్య వంటి  వాటి కారణంగా ఎవరైనా చనిపోతే.. వారి  ఆత్మ ప్రేతాత్మగా మారి తిరుగుతుంది. ఇలా ప్రేతాత్మ‌లుగా మారిన ఆత్మ‌లు.. ఏ రూపంలో ఉన్నా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి ఆత్మలనే దెయ్యాలు అని మనం పిలుస్తుంటాం. సహజ మరణం ద్వారా ప్రాణాలు విడిస్తే ఆత్మ..  ప్రేతాత్మగా మారదు. మరణించిన వ్యక్తికి పిండ ప్ర‌దానం, శ్రాద్ధ క‌ర్మ‌లు  నియమానుసారంగా చేయడం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది. శ్రాద్ధం చేయకపోతే పూర్వీకుల ఆత్మ శాంతి లేకుండా, ఆహారం లేకుండా తిరుగుతుంది. నెరవేరని కర్మలు, చెడు పనుల వల్ల కొన్ని ఆత్మలు మృత్యు లోకంలో సంచరిస్తూనే ఉంటాయి.

also read : Girls: ఇంట్లో ఒకే కానీ బడిలోనికి వెళితే దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్న బాలికలు..! దెయ్యాలా…?

ఆత్మ శరీరం బయటికి ఎలా వెళ్తుందంటే..

బతికి ఉండగా.. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించని వాడు,  పుణ్యకార్యాలు చేసినవాడు చనిపోయాక మోక్షాన్ని పొందుతాడ‌ని గ‌రుడ పురాణం అంటోంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మన శరీరం నవ ద్వారాలను కలిగి ఉంటుంది. వాటిలో ఒక మార్గం ద్వారా ఆత్మ బయటకు వెళ్తుంది. వ్యక్తి ఎక్కువగా మంచి పనులు చేస్తే.. ఆత్మ అతని ముఖం నుంచి బయటకు వెళ్లిపోతుంది. కళ్లలోంచి ఆత్మ వెళితే కళ్లు తెరుచుకుంటాయి. ఒకవేళ  ఆత్మ ముక్కు గుండా బయటకు వెళితే..  ముక్కు కొంచెం వంకరగా ఉంటుంది. ఆత్మ చెవుల నుంచి బయటికి వెళితే.. చెవులు పైకి లాగినట్టు కనిపిస్తాయి.

also read : After Death: మరణించే సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

చనిపోయే టైంలో మల,మూత్ర విసర్జన అందుకే..

ఒక వ్యక్తి యొక్క ఆత్మను తీసుకోవడానికి యమదూతలు వచ్చినప్పుడు.. ఆ ఆత్మ భయపడి శరీరంలోని  దిగువ భాగానికి చేరుకుంటుంది. ఆ పరిస్థితుల్లోనే చాలామంది చనిపోయే చివరి క్షణాల్లో మల,మూత్ర విసర్జన చేస్తారు. చనిపోతున్న వ్యక్తి ముందు నలుపు రంగులో ఉన్నఏదైనా ఆకారం కనిపిస్తే.. అది యమదూతలేనని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పసుపు రంగులో ఉన్న ఆకారం కనిపిస్తే.. అది ఆత్మను స్వర్గానికి తీసుకెళ్లడానికి వచ్చిన  దేవతలు.  ఒకరు తన చివరి క్షణాలలో ఏది అనుకుంటారో .. పునర్జన్మలో అదే అవుతారు. కాబట్టి మరణ సమయంలో విష్ణువును స్తుతించాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అని పఠించాలి. రామనామం, శివనామ పారాయణం కూడా చేయాలి. ఇలా చేస్తే ఆత్మకు సద్గతి లభిస్తుంది.