Viral Video : ఫాంటాతో మ్యాగీ.. ఇదేం కాంబినేష‌న్‌రా బాబోయ్‌..!

ఓరియో ప‌కోడీలు, ఫాంటా ఆమ్లెట్లు.. సంబంధం లేని ఇంగ్రీడియంట్స్‌తో ఫుడ్ త‌యారుచేయ‌డం ఈ మ‌ధ్య‌కాలంలో కామ‌న్ అయిపోయింది. ఇలాంటి ఓ ప్ర‌యోగ‌మే చేశాడు ఘ‌జియాబాద్‌లోని రోడ్ సైడ్ టిఫిన్ అమ్మే వ్య‌క్తి. అదే ఫాంటా మ్యాగీ.

  • Written By:
  • Publish Date - November 22, 2021 / 11:39 AM IST

జిహ్వ‌కో రుచి అని పెద్ద‌లు ఊరికే అన‌లేద‌ని కొన్ని చూస్తే అనిపిస్తుంది. ఓరియో ప‌కోడీలు, ఫాంటా ఆమ్లెట్లు.. సంబంధం లేని ఇంగ్రీడియంట్స్‌తో ఫుడ్ త‌యారుచేయ‌డం ఈ మ‌ధ్య‌కాలంలో కామ‌న్ అయిపోయింది. ఇలాంటి ఓ ప్ర‌యోగ‌మే చేశాడు ఘ‌జియాబాద్‌లోని రోడ్ సైడ్ టిఫిన్ అమ్మే వ్య‌క్తి. అదే ఫాంటా మ్యాగీ.

అవును.. ఫాంటాతో మ్యాగీ త‌యారుచేశాడు. యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోలు చేసే అమ‌ర్ అనే వ్య‌క్తి ఈ విష‌యం తెలిసి అక్క‌డ‌కు వెళ్లి ఎలా త‌యారుచేస్తున్నాడో షూట్ చేసి త‌న ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి..

కేవ‌లం 30 రూపాయ‌ల‌కే ఈ ఫ్యాంటా మ్యాగీ అందిస్తున్నాడు. దాదాపు ఆర్నెల్ల నుంచి ఈ ప్ర‌యోగం చేస్తున్నాన‌ని, వ‌చ్చిన‌వాళ్ల‌లో చాలామందికి టేస్ట్ న‌చ్చుతోంద‌ని కూడా చెబుతున్నాడు దాని చెఫ్‌.

ఈ వీడియో చూసిన వాళ్లు ర‌క‌రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఒక‌రు ఇదేం టేస్ట్‌రా బాబోయ్ అంటే మ‌రికొంత‌మంది ఇలాంటివి ట్రై చేస్తేనే మ‌జా అని కామెంట్ పెడుతున్నారు.