Geomagnetic Storm: భూమిని తాకిన సౌర తుఫాను.. ఈవారంలో మరిన్ని ముంచెత్తే ముప్పు!!

ప్రస్తుత సోలార్ సైకిల్ లో సూర్యుడు నిప్పులు కక్కడం ఆగట్లేదు. కరోనల్ మాస్ ఎజెక్షన్ పేలుళ్లు సూర్యుడి ఉపరితలంపై కొనసాగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 06:30 AM IST

ea ఈ పరిణామాల నడుమ ఆదివారం రోజున సౌర తుఫాను భూమిని తాకింది. ఇక్కడితో ఇది ఆగదని.. రానున్న రోజుల్లో మరిన్ని మైనర్ జీ-1 రకం సౌర తుఫానులు భూమి వైపు పోటెత్తె ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా భూమిపై పలు ఎత్తయిన ప్రదేశాల్లో అరోరాస్, రేడియో బ్లాక్ ఔట్స్ సంభవిస్తాయని అంటున్నారు. సౌర తుఫానుల వల్ల భూమికి అత్యంత ఎగువ ఆవరణలో ఉండే మాగ్నెటో స్పియర్ పొరలో కొన్ని అవాంతరాలు ఏర్పడుతాయి. ఫలితంగా టెలిఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ సిగ్నల్స్ దెబ్బతింటాయి.దీని ప్రభావం ఇంటర్నెట్ సేవలు, టెలికాం సేవలపై పడుతుంది. వాటి వినియోగంలో అవాంతరం వాటిల్లుతుంది. సెప్టెంబర్ 4న ఒక సౌర తుఫాను సెప్టెంబర్5న రాత్రి వరకు కొనసాగే ఛాన్స్ ఉంది.దీని సరాసరి వేగం గంటకు 21.6 లక్షల కిలోమీటర్లు. సౌర తుఫాన్లు భూమివైపు వస్తున్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ విపత్తును చూస్తున్నాం.

సౌర తుఫాను అంటే..

సౌర తుఫాను అంటే… ఇదో రకమైన అత్యంత వేడి గాలి అన్నమాట. సూర్యుడి వాతావరణంలో… ఓ కన్నం ఉంది. దాన్నే ఈక్వటోరియల్ హోల్ (equatorial hole) అంటారు. అందులోంచీ ఇది విశ్వంలోకి దూసుకొచ్చింది. ఈ వేడి గాలి సెకండ్‌కి 500 కిలోమీటర్ల వేగంతో వస్తోంది.

అరోరాలు..

మొత్తం భూమికి హాని చెయ్యకపోవచ్చుగనీ… దీని వల్ల అత్యంత ఎత్తులో అరోరాలు ఏర్పడతాయని అంటున్నారు. అంటే… ఉత్తర, దక్షిణ ధృవాల దగ్గర నివసించేవారికి… ఈ వేడి గాలుల వల్ల ఏర్పడే అరోరాలు కనిపిస్తాయి

పేలిపోయే ప్రమాదం..

స్పేస్ వెదర్ డాట్ కామ్ ప్రకారం… భూమి బయటి వాతావరణం వేడెక్కనుంది. ఫలితంగా శాటిలైట్లపై ప్రభావం పడనుంది. అలాగే GPS వ్యవస్థ దెబ్బతిని… మొబైల్ ఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ టీవీ సిగ్నల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది అంటున్నారు. ఎక్కువ కరెంటు సప్లై అయ్యే ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు.

ఆపగలమా?

ఈ సౌర తుఫానును ఆపడం మన వల్ల కాదు. మనం చేయగలిగింది… మన సెల్‌ఫోన్లు ఫుల్లుగా రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే… ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి. కరెంటు పరికరాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఈ జాగ్రత్తలు తీసుకుంటే… సౌర తుఫాను సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.