Site icon HashtagU Telugu

Dinosaur Tracks: ఈ ప్రాంతంలో వందలాది డైనోసర్లు జీవించాయట

dinosaur tracks in Poland

dinosaur tracks in Poland

పోలాండ్ లో వందలాది డైనోసర్ల పాదముద్రలు, ఎముకలు, ఎండిపోయిన పొలుసుల చర్మం గుర్తించినట్టు పోలాండ్ లోని పోలిష్ జియాలజికల్ ఇనిస్టిట్యూట్ నేషనల్ రీసెర్చ్ జియాలజిస్ట్ గ్రీజ్గోర్జ్ నిడ్విడ్జ్కి తెలిపారు.

దొరికిన అవశేషాలను బట్టి సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వందలాది డైనోసర్లు,చేపలు నివసించినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

పోలాండ్ లోని వార్సా నగరానికి 130 కిలో మీటర్లదూరంలో ఉన్న బోర్కోవిస్‌లోని ఓపెన్‌కాస్ట్ క్లే మైన్‌లో ఈ శిలాజాలను కనుగొన్నారు. ఈ అవశేషాలతో డైనోసర్ల ప్రవర్తన, అలవాట్లు ఎలా ఉండేవో తెలుసుకునే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇక్కడి అనవాళ్లను బట్టి ఈ ప్రదేశంలో వందలాది డైనోసర్లు పరుగెత్తడం, ఈత కొట్టడం, మరియు కూర్చోవడం, విశ్రాంతి తీసుకోవడం చేశాయని తెలుస్తోందని పోలాండ్ జియాలజిస్టులు అంటున్నారు.

డైనోసర్ల పాదముద్రలు దాదాపు 40 సెంటిమీటర్ల పొడవు ఉన్నాయని, ఇక్కడి అవశేషాలతో ఇప్పటికి ఏడు రకాల జాతులకు సంబందించిన వందలాది డైనోసార్ల జాడలు కనుగొన్నామని, మరిన్ని జాతులను కనుక్కొనే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Dinosaur tracks in Poland