Site icon HashtagU Telugu

Monkey With Pig Kidney : పంది కిడ్నీతో రెండేళ్లుగా బతుకుతున్న కోతి.. ఆసక్తికర రీసెర్చ్ !

Monkey With Pig Kidney

Monkey With Pig Kidney

Monkey With Pig Kidney : ‘పంది కిడ్నీతో కోతి బతకగలదా ?’ అంటే.. ‘బతకగలదు’ అని అమెరికాలోని మసాచుసెట్స్ కు చెందిన ఈజెనెసిస్ (eGenesis) కంపెనీ నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది. ‘జెనో ట్రాన్స్ ప్లాంటేషన్’ టెక్నాలజీ ద్వారా తాము పంది కిడ్నీని అమర్చిన కోతి గత రెండు సంవత్సరాలుగా ప్రాణాలతో బతికే ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.  ఈ ప్రయోగం కోసం యోకాటన్ జాతికి చెందిన పందిని ఎంపిక చేశారు. దీని బరువు దాదాపు 68 కేజీలు.  అమెరికాకు చెందిన మహిళల సగటు బరువు కూడా ఇంతే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యోకాటన్ జాతి పందుల కిడ్నీ సైజు కూడా మనిషి  కిడ్నీ సైజులోనే ఉంటుంది. అందుకే దీన్ని కోతికి అమర్చి పరీక్షించారు. కోతిపై నిర్వహించిన ట్రయల్స్ సక్సెస్ అయినందున.. తదుపరిగా అమెరికా ప్రభుత్వం అనుమతిని పొంది మనుషులపై ప్రయోగాలను ప్రారంభిస్తామని ఈజెనెసిస్ కంపెనీ అంటోంది. మానవ అవయవాల కొరతను భవిష్యత్తులో అధిగమించాలంటే ఈవిధమైన ప్రత్యామ్నాయాలను రెడీ చేసుకోక తప్పదని ఈజెనెసిస్ నిర్వాహకులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలోకి వెళితే.. ఈజెనెసిస్ కు చెందిన పరిశోధకులు ఒక వ్యక్తికి పంది గుండెను అమర్చగా ఇన్ఫెక్షన్ కు గురై కొన్ని రోజులకే చనిపోయాడు. అయితే గుండెకు ముందుగానే ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అలా జరిగి ఉండొచ్చని తెలిపారు. ఇక ఇటీవల బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తికి  పంది కిడ్నీని సర్జరీ ద్వారా అమర్చగా..  గత రెండు నెలలుగా సక్సెస్ ఫుల్ గానే పనిచేస్తోందని సైంటిస్టులు చెప్పారు. పందుల అవయవాల సైజు, నిర్మాణ స్వరూపం మనుషుల శరీర అవయవాలలాగే ఉన్నందు వల్ల అవయవ మార్పిడి ప్రయోగాల్లో కీలకంగా మారాయని వివరించారు. అయితే కోతుల కంటే మనుషుల బరువు ఎక్కువ. రక్తపోటు కూడా ఎక్కువ. అందుకే పంది అవయవాలు మనిషి శరీరంలో ఇమిడిపోగలవా ? లేదా ? అనేది పరిశోధనల్లో తేలాల్సి (Monkey With Pig Kidney) ఉంటుంది.

Also Read: Rashmika Mandanna: భరించలేక పోతున్న రష్మిక

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.