World 5th Richest Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ..ప్రపంచంలోనే టాప్ 5 కుబేరుడు..!!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే..కార్పొరేట్లు లాభపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 09:39 AM IST

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే..కార్పొరేట్లు లాభపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. అంతేనా గుజరాత్ రాష్ట్రానికి చెందిన అంబానీలు, అదానీలు ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ఎదిగారని కాంగ్రెస్ నేతలు అరోపిస్తుంటారు. ఇక ఈ ఇద్దరు గుజరాతీలు దేశవ్యాపారా రంగాన్ని అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ఆసియాలోనే కుబేరులుగా ఎదిగారు వీరిద్దరు. గుజరాత్ కు చెందిన మోదీ దేశంలో అధికారంలో ఉండటం….వీరితో దగ్గరి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అందుకే వీరి వ్యాపారాలు దూసుకెళ్తున్నాయని ఆరోపిస్తుంటారు.

ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ధనవంతులు అంబానీ అదానీ. ఇద్దరూ కూడా ఎప్పుడూ మార్కెట్ ను శాసిస్తుంటారు. వ్యాపారాలను విస్తరించి విజయాలను సాధిస్తుంటారు. ఇప్పుడు ఇద్దరు పరస్పరం పోటీపడుతున్నారు. నెంబర్ వన్ ర్యాంకు లక్ష్యంగా సాగుతున్న వీరి వ్యాపార ఫైట్లో ఇప్పుడు అదానీ దూసుకువచ్చాడు. తాజాగా కుబేరుల లిస్టులో అదానీ భారత్ లో మొదటిస్థానంలో నిలిచారు. ఇక ఆసియాలోనూ నెంబర్ వన్ బిజినెస్ మెన్ గా నిలిచాడు. ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టి ఏకంగా ఐదవ స్థానంలోకి దూసుకొచ్చాడు అదానీ.

ఇక ఇండియాలో గౌతం అదానీ మళ్లీ మొదటిస్థానంలో నిలిచారు. ఆయన సంపద పెరుగుతూనే ఉంది. తాజాగా 123.7బిలియన్ డాలర్ల సంపదతో అదానీ మరోసారి ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితాలో ప్రపంచంలోనే టాప్ ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా అదానీ వ్యాపారాలు కోవిడ్ సమయంలోనూ దూసుకుపోయాయి. 2022లోనే ఆయన సంపద 43బిలియన్ డాలర్లు పెరిగింది. మొత్తంగా అదానీ సంపద ఈ ఏడాదిలో 56శాతం పెరిగింది.

ఇండియాతోపాటు ఆసియాలో కుబేరుడిగా మొదటిస్థానంలోకొనసాగిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా ఎలన్ మస్క్, రెండో స్థానంలో అమేజాన్ అధినేత జెఫ్ బెజోస్, మూడో స్థానంలో బెర్నాల్డ్ ఆర్నాల్డ్, నాలుగో స్థానంలో బిట్ గెట్స్ ఉన్నారు.