Site icon HashtagU Telugu

Gautam Adani Help : అదానీ పెద్ద మనసు..ఎంత పెద్ద సాయం చేశారంటే ?

Gautam Adani Help

Gautam Adani Help

బిలియనీర్ గౌతమ్ అదానీ తన హెల్పింగ్ నేచర్ ను చాటుకున్నారు. ప్రముఖ పర్వతారోహకుడు అనురాగ్ మాలో నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం నుంచి లోతైన లోయలో పడిపోయారనే వార్త తెలియడంతో గౌతమ్ అదానీ ఫౌండేషన్ (Gautam Adani Help) స్పందించింది. ఎయిర్ అంబులెన్స్ పంపి అనురాగ్ మాలోను రక్షించింది. ఆ తర్వాత నేపాల్ లోని ఖాట్మండు నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. సకాలంలో ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి తన సోదరుడిని రక్షించినందుకు(Gautam Adani Help) గౌతమ్ అదానీకి అనురాగ్ మాలో సోదరుడు ఆశిష్ మాలో ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆశిష్ మాలూ ట్వీట్‌కు అదానీ రిప్లై ఇస్తూ.. గాయపడిన పర్వతారోహకుడికి సహాయం చేసిన ఘనత అదానీ ఫౌండేషన్‌కు నేతృత్వం వహిస్తున్న తన భార్యకే దక్కుతుందని పేర్కొన్నారు. అనురాగ్ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

also read : Gautam Adani: ఆసక్తి రేపుతున్న గౌతమ్ అదానీ – శరద్ పవార్ భేటీ

అసలు ఏం జరిగింది ? 

అన్నపూర్ణ పర్వతం మొత్తం ప్రపంచంలో 10వ ఎత్తైన పర్వతం. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన అనురాగ్ మాలో గత నెల 17న అన్నపూర్ణ పర్వతంపై 5,800 మీటర్ల ఎత్తు నుంచి లోతైన లోయలో పడ్డాడు. అన్నపూర్ణ పర్వతం మూడో క్యాంపు నుంచి కిందికి దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడిపోయిన మూడు రోజుల తర్వాత(ఏప్రిల్ 20న ఉదయం) అతన్ని రక్షించారు. అక్కడ అతన్ని సమీపంలోని వైద్య శిబిరానికి తీసుకెళ్లారు. దీని తర్వాత అతన్ని పోఖారాలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించి, ఆపై ఖాట్మండులోని మెడిసిటీలో చేర్చారు. ఈ సమయంలో అనురాగ్ మాలో కుటుంబం అదానీ ఫౌండేషన్‌ను ఆశ్రయించి.. తమ వాడిని ఎయిర్‌లిఫ్ట్ చేసి కాపాడాలని అభ్యర్థించింది. దీంతో గౌతమ్ అదానీ ముందుకు వచ్చి.. తన ఫౌండేషన్ ద్వారా ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో అనురాగ్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్ లోని జై ప్రకాష్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్‌ ICUలో చేర్చారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.