వినాయక చవితి వస్తుందంటే.. చాలు రకరకాల మండపాలు, ఆకర్షణీయమైన గణపయ్య విగ్రహాలు కొలువు దీరుతుంటాయి. ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాల్లోని హీరోల మాదిరిగా రూపుదిద్దుకొని దర్శనమిస్తుంటాడు. కానీ గుజరాత్‌లో మాత్రం విగ్రహం ప్రత్యేకతే వేరు. సూరత్‌లో వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు.ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు.
ఈ వజ్రం ధర గురించి కనుభాయ్ ఏమాత్రం చెప్పరు. ఎందుకంటే అది కేవలం వజ్రం మాత్రమే కాదు వజ్రంలో గణపతి కూడా ఉండటంతో ఆ వజ్రం ధర చెప్పరు ఆయన. గణపయ్యకు ధరను నిర్ణయించే వారమా…? అనేది ఆయన భావన. అందుకే ఆ వజ్రం ధర గురించి చెప్పరు. కానీ ఆయన ధర గురించి చెప్పకపోయినా వజ్రాల వ్యాపారులు మాత్రం ఆ వజ్రం ధరను అంచనా వేశారు.మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంటుంటారు. ఈ వినాయకుడ్ని చూసేందుకు భక్తుల క్యూ కడుతున్నారు.
కాగా మరోవైపు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడిని రూ.1.51 కోట్ల కరెన్సీ నోట్లతో ధనపతిగా అలంకరణ చేశారు. 41వ వార్షికోత్సవంలో భాగంగా రూ.500, రూ.200, రూ.50 కొత్త కరెన్సీ నోట్లతో స్వామి వారి విగ్రహం, మండపాన్ని అలంకరణ చేయడం అందర్నీ ఆకట్టుకుంది.
Also Read: Rashmika Mandanna: యానిమల్ నుంచి రష్మిక లుక్ రిలీజ్, గీతాంజలిగా నేషనల్ క్రష్ ఇంట్రడ్యూస్!