Celebrity Single Mothers : సెలబ్రిటీ సింగిల్ మదర్స్.. స్ఫూర్తిదాయక జీవితం

Celebrity Single Mothers :  తల్లి.. ప్రపంచంలోనే అతిపెద్ద బాధ్యతను నెరవేర్చే వ్యక్తి. 

Published By: HashtagU Telugu Desk
Celebrity Single Mothers

Celebrity Single Mothers

Celebrity Single Mothers :  తల్లి.. ప్రపంచంలోనే అతిపెద్ద బాధ్యతను నెరవేర్చే వ్యక్తి.  యావత్ ప్రపంచానికి ఆదర్శ పౌరులను అందించే వారధి తల్లే. భర్త నుంచి విడిపోయినా ఎంతోమంది తల్లులు తమ పిల్లలను బాధ్యతగా పెంచుతుంటారు. పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేస్తుంటారు. ఇలాంటి సెలబ్రిటీ సింగిల్ మదర్స్‌పై(Celebrity Single Mothers) కథనమిదీ..

We’re now on WhatsApp. Click to Join.

సానియా మీర్జా  – ఇజాన్

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఇటీవల విడాకులు తీసుకుంది. పెళ్లయిన 14 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న వెంటనే షోయబ్ మాలిక మరో పెళ్లి చేసుకున్నారు. సానియా, షోయబ్ దంపతులకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఈ అబ్బాయిని తల్లి సానియానే పెంచుతున్నారు.

సుస్మితా సేన్ – ఇద్దరు కుమార్తెలు

మాజీ మిస్ యూనివర్స్, నటి సుస్మితా సేన్ పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకున్నారు. వారిని చదివిస్తూ.. సుస్మితా సేన్ ఆలనాపాలన చేస్తున్నారు.  ఈవిధంగా ఆమె ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.

మలైకా అరోరా – అర్హాన్ 

ప్రముఖ నటి మలైకా అరోరా ఎంతో ఫ్రీడమ్‌గా జీవిస్తుంటారు. ఈమె లైఫ్ స్టయిల్‌పై గూగుల్‌లో సెర్చింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. తన సొంత నిబంధనలతోనే జీవించే మలైకా.. ప్రతి లైఫ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. మలైకాకు తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో అర్హాన్ అనే కొడుకు కలిగాడు. అతడిని మలైకా అరోరానే పెంచుతున్నారు.

నీనా గుప్తా  – మసాబా 

నీనా గుప్తా ఒక శక్తివంతమైన మహిళ. ఈమెకు మసాబా అనే కూతురు ఉంది. ఒంటరి తల్లిగానే నీనా గుప్తా తన కూతురును పెంచుతోంది. మన సమాజంలో అవివాహిత తల్లిగా ఉండటాన్ని నిషిద్ధంగా భావించే సమయంలోనే ఈమె తన కూతురుకు జన్మనిచ్చింది. నీనా గుప్తా తన వ్యక్తిగత జీవితంలోని బాధలను, ఒడిదుడుకులను అప్పుడప్పుడు వెల్లడిస్తునే ఉంటారు.

చారు అసోపా – చారు జియానా 

చారు అసోపా టీవీ నటి.  ఆమె మాజీ భర్త రాజీవ్ సేన్‌తో  గతేడాది డైవర్స్ తీసుకున్నారు. వీరికి చారు జియానా అనే బిడ్డ జన్మించింది. ఈ నటి కూడా తన బిడ్డను తానే పెంచుతున్నారు. ఒంటరి తల్లిగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె చెప్తూనే ఉంటారు.

సుస్సానే ఖాన్ – ఇద్దరు కొడుకులు

సుస్సానే ఖాన్ భారతీయ ఇంటీరియర్ డిజైనర్. ఈమె మాజీ భర్త ఎవరో తెలుసా ? హృతిక్ రోషన్  !! 20214 లో హృతిక్ నుంచి ఈమె  విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు సుస్సానే ఖాన్ వద్దే ఉంటున్నారు. ఒంటరి తల్లిగానే ఈమె తన కొడుకులను పెంచుతోంది.

సాక్షి తన్వర్

ప్రముఖ భారతీయ టీవీ నటి సాక్షి తన్వర్ కూడా ఒంటరి తల్లే. ఈమె 2018లో దిత్యా అనే తొమ్మిది నెలల బాలికను దత్తత తీసుకుంది. ఆ పాప ఆలనాపాలనా చూస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

  Last Updated: 28 Jan 2024, 11:37 AM IST