Site icon HashtagU Telugu

MPs to Beauties: మేము సైతం.. యుద్ధభూమిలో ‘ఉక్రెయిన్’ బ్యూటీలు!

Queen

Queen

అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా ఉక్రెయిన్ కంట్రీపై యుద్ధభేరి మోగిస్తోంది. ఉక్రెయిన్ కూడా ఏమాత్రం బెదరకుండా రష్యా దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు మగవాళ్లే యుద్ధరంగంలోకి దిగి దాడులను తిప్పికొట్టారు. తాజాగా మహిళలు సైతం తుపాకులు చేతపట్టి తగ్గేదేలే అంటూ పోరాటానికి దిగారు. ఆ దేశ ఎంపీలు కిరా రుడిక్, లెసియా వాసిలెంకో కైవ్‌లో ప్రత్యక్ష యుద్ధంలోకి దిగారు.

తమ దేశాన్ని రక్షించుకోవాలనే పిలుపుకు దేశవ్యాప్తంగా మహిళలు, రాజకీయ నాయకుల అందాల రాణుల వరకు ఆయుధాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కిరా రూడిక్ మాట్లాడుతూ.. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు గ్రూపులను నిర్వహిస్తున్నామని, దాడులను ఎదుర్కొనేందుకు విదేశీయులకు పిలుపునిచ్చాం. సామాన్య పౌరులకు ట్రైనింగ్ ఇచ్చే సమయం కూడా లేదు. అయినా దాడులకు ఎదుర్కొగలమనే నమ్మకం ఉంది. మేం ఉక్రెయిన్ అంతర్జాతీయ ప్రాదేశిక రక్షణ విభాగాన్ని ప్రారంభించాం, ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలలో ద్వారా సంప్రదింపుల ద్వారా యుద్ధంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నాం. పురుషులతో పాటు మహిళలు కూడా కలిసి రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ముందుకొస్తున్నారు’’ అని అన్నారు. అయితే ఈ యుద్ధరంగంలో ఉక్రెయిన్ అందెగత్తెలు తుపాకులు పట్టి యుద్ధరంగంలోకి దిగడం, దాడులను ప్రతిఘటించడం లాంటి విషయాలు ప్రస్తుతం  చర్చనీయాంశమవుతున్నాయి. తమ దేశ రక్షణకు అందమైన భామలు ముందుకొచ్చి, తుపాకులు పట్టడం పట్ల ఉక్రెయిన్ ఐక్యతను చాటిచెప్తున్నారు.