Site icon HashtagU Telugu

February 1 – IMPS : ఫిబ్రవరి 1 విడుదల.. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ ఇకపై ఇంకా ఈజీ!

February 1 Imps

February 1 Imps

February 1 – IMPS : ఫిబ్రవరి 1 నుంచి మొబైల్ బ్యాంకింగ్ సేవలు మరింత సరళతరం కానున్నాయి.  ప్రత్యేకించి ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) కొత్తపుంతలు తొక్కనుంది. మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లో బెనిఫిషియరీ పేరు, అకౌంట్ నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC) కోడ్‌ లేకుండానే బ్యాంకు ఖాతాల  మధ్య ఐఎంపీఎస్ ద్వారా రూ.5 లక్షల దాకా నగదును బదిలీ చేయొచ్చు. మనం నగదును ఎవరికైతే పంపుతున్నామో వారి బ్యాంకింగ్ మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ పేరు ఉంటే చాలు. వాస్తవానికి దీనిపై గతేడాది అక్టోబర్‌ 31నే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఓ సర్క్యులర్‌ను రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు వరకు ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్(February 1 – IMPS) కోసం మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లో బెనిఫిషియరీ పేరు, అకౌంట్ నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌  వంటి వివరాలన్నీ ఎంటర్ చేయాల్సి  వచ్చేది.

We’re now on WhatsApp. Click to Join

ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ ఇలా..

  • మొబైల్ బ్యాంకింగ్‌ యాప్‌ ఓపెన్‌ చేయండి.
  • ‘ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌’ ఆప్షన్‌‌ను ఎంచుకోండి.
  • మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి ఐఎంపీఎస్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • ఎవరికైతే పంపుతున్నామో వారి మొబైల్‌ నంబర్‌, వారికి ఖాతా ఉన్న బ్యాంక్‌ పేరును నమోదు చేయండి.
  • పంపే నగదు మొత్తాన్ని ఎంటర్‌ చేయాలి.
  • మనం ఎంటర్ చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ‘కన్ఫమ్‌’పై క్లిక్‌ చేయాలి.
  • మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ (OTP) ని ఎంటర్ చేస్తే మనీ ట్రాన్స్ ఫర్ క్షణాల్లో కంప్లీట్ అవుతుంది.

యూపీఐ యాప్స్ వచ్చిన తర్వాత మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి బ్యాంకులకు వెళ్లాల్సిన పని తప్పింది. ఇంటర్ నెట్ బ్యాంకిగ్ ని వాడాల్సిన పని కూడా లేకుండా పోయింది.ఈ మనీ ట్రాన్సాక్షన్స్ లో మరింత మెరుగైన సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాలంటే తప్పని సరిగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. కాని ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా కూడా బెనిఫిషయరీ పేరు, బ్యాంకు పేరు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ ద్వారా ఇప్పటి వరకు నగదు బదిలీ చేసే సౌకర్యం ఉండేది.

Exit mobile version