పాకిస్తాన్ ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఖలిస్థాన్ ఉగ్రవాదులకు డబ్బులు, ఆయుధాలు ఇస్తున్న పాక్ .. ఇప్పుడు పంజాబ్ యూత్ జీవితాలను నాశనం చేసేందుకు డ్రోన్లలో(Pak Drug Drones) డ్రగ్స్ ను సప్లై చేస్తోంది. డ్రోన్ టెక్నాలజీని డ్రగ్స్ సరఫరా కోసం దుర్వినియోగం చేస్తోంది. గత 24 గంటల వ్యవధిలో పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట వేర్వేరు చోట్ల మూడు పాకిస్తాన్ డ్రోన్‌లను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కూల్చేసింది. మరొకటి త్రుటిలో తప్పించుకొని పరారైంది. ఈవిషయాన్నిBSF అధికార వర్గాలు వెల్లడించాయి. కూలిపోయిన ఒక డ్రోన్ లో డ్రగ్స్ ను గుర్తించారు.
also read : BJP and MIM: పాకిస్తాన్ తర్వాత పాతబస్తీనే టెర్రరిస్టులకు అడ్డా!
రతన్ ఖుర్ద్ గ్రామంలో స్వాధీనం చేసుకున్న మరో డ్రోన్ లో (Pak Drug Drones) 2.6 కిలోల రెండు హెరాయిన్ ప్యాకెట్లు దొరికాయి. చైనాకు చెందిన DJI కంపెనీ తయారు చేసే “DJI మ్యాట్రిస్ 300 RTK” పేరు కలిగిన మరో డ్రోన్ ను అమృత్‌సర్ జిల్లాలోని ఉదర్ ధరివాల్ గ్రామంలో భద్రతా బలగాలు కూల్చేశాయి. రతన్ ఖుర్ద్ గ్రామంలో మరో డ్రోన్‌ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకోగా.. అది పాక్‌వైపు తిరిగి వెళ్లిపోయింది. పాకిస్తాన్ వైపు నుంచి కొంతమంది ఈ డ్రోన్‌ను ఆపరేట్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు.