Site icon HashtagU Telugu

Pendulum In Parliament : కొత్త పార్లమెంట్ లో పెండ్యులమ్‌.. ఏంటో తెలుసా ?

Pendulum In Parliament

Pendulum In Parliament

కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లోని గ్యాలరీలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) ఒక వస్తువును ఏర్పాటు చేసింది.అదే.. ఫౌకాల్ట్‌ పెండ్యులమ్‌ (Pendulum In Parliament). ఇంతకీ దీన్ని పార్లమెంట్ భవనంలో ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..   

భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూ భ్రమణం అంటారు. ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త లియోన్‌ ఫౌకాల్ట్‌ 1851లో తొలిసారిగా భూ భ్రమణంపై  ప్రయోగాలు చేశారు. అయితే 19వ శతాబ్దంలో ఇతర శాస్త్రవేత్తలు ఆయన వదిలి వెళ్లిన ప్రయోగాలను పూర్తి చేశారు. భూ భ్రమణం ఎలా ఉంటుందనే దానిపై ఐడియాకు వచ్చేటందుకు ఒక వస్తువును తయారు చేశారు. దానికి  ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త లియోన్‌ ఫౌకాల్ట్‌  పేరు పెట్టారు. ఈ పెండ్యులమ్‌ గంటకు 1,670 కి.మీ. వేగంతో భ్రమణం చేస్తుంది.

Also read : Uk: అరుదైన ప్రయోగం సక్సెస్.. ముగ్గురు డిఎన్ఎలతో జన్మించిన శిశువు?

మన కొత్త పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన ఫౌకాల్ట్‌ పెండ్యులమ్‌ను(Pendulum In Parliament) 22 మీటర్ల ఎత్తు, 36 కిలోల బరువుతో రూపొందించారు. మన దేశంలోనే అతిపెద్ద పెండ్యులమ్‌ ఇదే. ఇది తన పూర్తి భ్రమణాన్ని పూర్తి చేసేందుకు 49 గంటల 59 నిమిషాల 18 సెకన్ల సమయం పడుతుంది. దీన్ని తయారు చేసేందుకు 10 నుంచి 12 నెలల సమయం పట్టింది. మన దేశంలోనే తొలిసారి 1991లో ఇలాంటి పెండ్యులమ్‌ను పుణె విశ్వవిద్యాలయంలోని ఆస్ట్రోఫిజిక్స్ విభాగంలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పెండ్యులమ్‌ (ఎత్తు 67 మీటర్లు) ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్న మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో ఉంది.

భూ భ్రమణ వేగం పెరుగుతోంది.. ఎందుకంటే ?

భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2022 జులైలో 1.59 మిల్లీ సెకండ్లలోనే భూ భ్రమణం పూర్తయినట్టు గుర్తించారు. దీంతో అది చాలా చిన్న రోజుగా రికార్డుకెక్కింది. అంతకుముందు  1960, 2020 సంవత్సరాల్లో ఇలా జరిగింది. 2020 జూలై 19న 24 గంటల కంటే 1.47 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూమి తన చుట్టూ తాను తిరిగింది. 2021లో కూడా భూ భ్రమణ వేగం పెరిగింది. తాజాగా గత నెల మరోసారి స్పీడ్ పెరిగింది. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగడానికి సరైన కారణాలు ఇప్పటికీ తెలియడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే భూమి లోపలి లేదా బయటి పొరల్లో మార్పు, మహాసముద్రాలల్లో ఆటుపోట్లు, వాతావరణంలో మార్పులు కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే భౌగోళిక ధ్రువాల కదలికల వల్ల భూ భ్రమణ వేగం పెరగుతుందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. దీనిని టెక్నికల్ భాషలో చాండ్లర్ వొబుల్ అని పిలుస్తారు.