Roja : సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

Roja : సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా, సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూ పై ప్రకటనలో చేశారు. జగన్ ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారు.

Published By: HashtagU Telugu Desk
supreme court cancels greater housing society land allotment

supreme court cancels greater housing society land allotment

Tirumala laddu controversy : వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి రోజా సుప్రీంకోర్టు తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ మొదట నుంచి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు లడ్డూ కల్తీ అని ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయి. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా, సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూ పై ప్రకటనలో చేశారు. జగన్ ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారు.

సిట్ ను హడావుడిగా ఏర్పాటు చేశారు. ఈ సిట్ పై మాకు నమ్మకం లేదు. ఇది వరకే చంద్రబాబు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డీఐజీ స్థాయి అధికారితో సిట్ వల్ల నిజాలు బయటకు రావు. సీబీఐకి ఇవ్వాలని మేము కోరుతున్నాము. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలి. లడ్డుని తినాలా వద్దా అని భక్తులు అనుమానంతో ఉన్నారు. లడ్డూ తినకుండా భక్తులు వెళ్ళిపోతుండడం నాకు చాలా బాధ వేసింది. నేను ఇవాళ తమిళనాడు అలఘర్ ఆలయంలో ఉన్నాను. తప్పుడు ప్రకటన చేసిన వారికి శిక్ష పడాలని నేను ఇక్కడ దేవుడుని వేడుకున్నాను.

Read Also: US Visas : భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్.. మరో 2.50 లక్షల వీసా అపాయింట్‌మెంట్లు

  Last Updated: 30 Sep 2024, 05:02 PM IST