Site icon HashtagU Telugu

Caste Census : కుల గణన పై మాజీ సీఎం సూచనలు

Former Former CM Nadendla Bhaskara Rao

Former CM Nadendla Bhaskara Rao

Former CM Nadendla Bhaskara Rao: తెలంగాణలో నవంబర్ 6 నుంచి సమగ్ర కులగణన జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కులగణనపై ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మాట్లాడుతూ..నేను కుల గణనకి వ్యతిరేకి కాదు.. కానీ సూచనలు చేయాలనుకుంటున్నా అన్నారు. కింది స్థాయి కులాలు అనుకునే వాళ్ళు..పెద్ద స్థాయి కులాల వాళ్ళ ఇంటి పక్కనే ఇండ్లు కట్టుకుంటున్నారు.. భూములు కొంటున్నారు. అలాంటి పరిస్థితిలో కుల గణనతో ఇబ్బంది వస్తుందేమో అని అనుమానంగా ఉంది. అయితే ఈ ప్రక్రియ గజిబిజి లేకుండా సాఫీగా జరగాలి అన్నారు. ఇక సుప్రీం కోర్టు కూడా 50 శాతం రిజ్వేషన్లను మాత్రమే అంగీకారం ఇచ్చాయి అని తెలిపారు.

అంతేకాక కుల గణనతో రిజర్వేషన్ పెంచాలని అనుకున్నా.. కోర్టుల్లో ఇబ్బంది వస్తుంది అనే అనుమానం ఉందన్నారు. దీంతో గ్రామాల్లో అలజడి వచ్చే పరిస్థితి వస్తుంది. కులం తెలుసుకోవాలని అనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. కానీ కుల గణన అని గెలికి.. అలజడి క్రియేట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలా చేస్తే మంచి వాతావరణం చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఈ కుల గణన మంచిది కాదేమో జాగ్రత్తగా ఉండాలని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ఇకపోతే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. ఆయన వయసుకు తగిన ఉద్యోగం కాదు.. అయినా కూడా బాగా పరిపాలన చేస్తున్నారు అని మాజీ సీఎం భాస్కరరావు అభిప్రయపడ్డారు.

కాగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటి సామాజిక, ఆర్థిక, విద్యా, కుల మరియు రాజకీయ స్థితిగతులను అంచనా వేయడానికి ఇంటింటికీ కులగణన సర్వే ప్రారంభమైంది. వివరణాత్మక గమనికల తయారీ మరియు తప్పిపోయిన ఇళ్లను తిరిగి సందర్శించడం కోసం మరో మూడు వారాలు తదుపరి మూడు వారాల్లో డేటాను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబాలకు ప్రాథమికంగా సామాజిక స్థితి, అలాగే ఉపాధి మరియు వృత్తుల వంటి ఆర్థిక పారామితుల గురించి అడిగే ప్రశ్నాపత్రం ఇవ్వబడుతుంది.

Read Also: Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య..