Hemant Soren : సుప్రీంకోర్టులో పిటిషన్‌ వెనక్కి తీసుకున్న మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 03:33 PM IST

Hemant Soren:జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) మనీల్యాండరింగ్‌ కేసు(Money laundering case)లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈడీ అరెస్టును ప్రశిస్తూ ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్‌ వేశారు. ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సోరెన్‌ తరపున వాదించిన సిబల్‌ ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనితో పాటు ట్రయల్ కోర్ట్ లో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన వాస్తవాన్ని దాచినందుకు హేమంత్ సోరెన్‌ను జస్టిస్ దీపంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ మందలించింది. అతని ప్రవర్తన మచ్చలేనిదేమీ కాదని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

”మీ ప్రవర్తన చాలా చెబుతోంది. మీ క్లయింట్ నిజాయితీతో వస్తారని మేము ఆశించాం. కానీ మీరు వాస్తవాలను దాచిపెట్టారు” అంటూ హేమంత్ సోరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు కోర్టు తెలిపింది. కోర్టు హెచ్చరికతో ఆ పిటిషన్‌ను కపిల్ సిబల్ ఉపసంహరించుకున్నారు. కాగా, జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయగా.. ఆయన అరెస్టును జార్ఖాండ్ హైకోర్టు సమర్ధించింది. రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును మే 13న ట్రయిల్ కోర్టు కొట్టివేసింది.

Read Also: Samantha : నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. సమంత ఎవరి కోసం ఈ ప్రార్ధనలు..?