Site icon HashtagU Telugu

KTR : ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా?: కేటీఆర్‌

KTR Fire On Congress

For the Congress party, politics is more important than the benefit of the farmers: KTR

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. . కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని మరోసారి తేలిపోయిందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని తమ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం అని కూడా L &T company ముందుకు వచ్చిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే అజెండాతో కాఫర్ డాం కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తోందని విమర్శించారు. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికల్లో లాభం కోసమేనా? అనే ప్రశ్నించారు.

Read Also: WhatsApp Chat Filters: వాట్సాప్ ఛాట్‌లను వడపోసే.. మూడు ఫిల్టర్లు..!

మరోవైపు తాము చెప్పేదాక మేడిగడ్డపై మరమతులు చేయొద్దని ఎల్‌ అండ్‌ టీ కంపెనీకి ఉత్తమ్ హెచ్చరికలు చేశారు. మేడిగడ్డపై మరమతులు చేసేందుకు ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ముందుకు వచ్చి జరిగిన నష్టాన్ని మొత్తం భరిస్తామని వెల్లడించింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. అసలు మరమ్మతుల మీద రివ్యూ చేయమని మీకు ఎవరు చెప్పారంటూ ఆ సంస్థపై ఫైర్ అయ్యారు.

Read Also: Rama Navami: రామనవమి వేడుకలో హింసాత్మక ఘటన.. 20 మందికి గాయాలు

అసలు మిమ్మల్ని మరమ్మతుల మీద రివ్యూ చేయమని ఎవరు చెప్పరంటూ మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. అయ్యర్ కమిటీ సిఫార్సులొచ్చాకే రిపేర్లు చెయ్యాలని ఆదేశించారట. బ్యారేజ్ మరమ్మత్తులకై నిర్మాణ సంస్థ ఎల్ & టీ సంస్థతో ఇటీవల నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ అనిల్ కుమార్ చర్చలు జరపడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వ అనుమతి లేకుండా, పాలసీకి విరుద్ధంగా మరమ్మత్తులు ఎలా చేస్తారంటూ ఉత్తమ్ ఫైర్‌ అయ్యారట. దీంతో ఇప్పుడు ఈ వివాదం హాట్‌ టాపిక్‌ అయింది.