Site icon HashtagU Telugu

Negative Thoughts: నెగిటీవ్ థాట్స్ ఇబ్బంది పెడుతున్నాయా..? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!

Negative Thiughts

Negative Thiughts

గత అనుభవాల మూలంగానే నెగిటీవ్ ఆలోచనలు వస్తుంటాయి. ఈ నెగిటివ్ ఆలోచనలు అంద తేలిగ్గా వదిలేయాల్సిన విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రతికూల ఆలోచనల వల్ల జీవితంలో ముందడుగు వేయలేం. ముఖ్యంగా వీటితో మానసికంగా కుంగిపోతాం. అంతేకాదు మీపై మీరే పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. కాబట్టి వీటి నుంచి ఎంత తొందరగా బయటపడితే ఆరోగ్యానికి అంత మంచి జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలు, ఎదురైన అపజయాలు…వీటి మూలంగానే ప్రతికూల ఆలోచనలనేవి మనలో ప్రారంభం అవుతాయి. ఈ ప్రతికూల ఆలోచనలు అందరిలోనూ సహజంగా వస్తుంటాయి. కానీ కొందరు వీటిని తొందరగా మర్చిపోతే…మరికొంత మంది మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. ప్రతిక్షణం, ప్రతి సంఘటన వారి మదిలో తిరుగుతూనే ఉంటుంది.

గతంలో జరిగిన అపజయాలపై ఎక్కువగా ఆలోచిస్తుంటారు. గత అనుభవాలే వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారిలోనే నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. దీంతో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అంతేకాదు మానసికంగా కుంగిపోతారు. ఏ పని ప్రారంభించాలన్నా వారిలో నెగిటీవ్ ఆలోచనలే ముందుంటాయి. అయితే ఈ నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడేందుకు మానసిక నిపుణులు కొన్ని సింపుల్ చిట్కాలు సూచిస్తున్నారు. వీటిని మీరు ఫాలో అయినట్లయితే…ఇంకేప్పుడు ప్రతికూల ఆలోచనలు మీలో రావు.

* గతం అనేది భవిష్యత్తుకు పునాది. కాబట్టి గతంలో జరిగిన అనుభవాలను, పరాజయాలను, విజయాలుగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. అపజయాలను పట్టుకుని వేలాడకూడదు. గతాన్ని మార్చడం ఎవ్వరితోనూ కాదు. కాబాట్టి వాటన్నింటిని ఓ పీడకలలా భావించి మర్చిపోవాలి.
* ఇతరుల వల్ల మీరు ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బందులను గుర్తుచేసుకోవడం వల్ల మీ మనస్సు పాడైతుంది. అంతే తప్పా మరే లాభం ఉండదు. అంతేకాదు మీ వల్ల ఇతరులకు కూడా ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడాలి.
*ఇక నెగిటివ్ ఆలోచనలు మీలో వచ్చినప్పుడు వాటన్నింటిని ఒక నోట్ బుక్ లో రాసుకోవాలి. అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో మీరు ఓసారి గమనించండి.
*వీటి నుంచి బయటపడాలంటే…వాటి నుంచి బయటపడాలన్న బలమైన కోరిక, తపన మీలో ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే మీరు నెగిటివ్ ఆలోచనల నుంచి బయటకు వస్తారు.
*భవిష్యత్తులో ఇలా జరగవచ్చు…అలా జరగవచ్చు…అంటూ పదే పదే ఆలోచించడం వల్ల మీ మానసిక ఆరోగ్యంతోపాటుగా, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి భవిష్యత్తు అంతా మంచే జరుగుతుందన్న ఆలోచన మీలో ఉండాలి.
* ఇంకో విషయం తెలుసా…మీపై మీకు నమ్మకం, గౌరవం, ఇష్టం లేనప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించండి, గౌరవించుకోండి…అప్పుడు నెగిటివ్ ఆలోచనలు అనేవి అస్సలు రావు. అంతా సవ్యంగానే జరుగుతుంది.
*ఎప్పుడు సంతోషంగా ఉంటే నెగిటివ్ ఆలోచనలు రావు. ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు.