Site icon HashtagU Telugu

Key Chain – Flash Pay : ‘కీ చైన్‌’ పట్టేయ్.. ‘కాంటాక్ట్‌ లెస్‌ పేమెంట్స్’ చేసేయ్

Key Chain Flash Pay

Key Chain Flash Pay

Key Chain – Flash Pay : ఇక ఈ ‘స్మార్ట్‌ కీ చైన్‌’ ఉంటే చాలు కాంటాక్ట్‌ లెస్‌ పేమెంట్స్ ఇంకా ఈజీగా చేయొచ్చు. ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్‌ బ్యాంక్‌  దీన్ని తీసుకొచ్చింది. ఎన్‌పీసీఐ ‘రూపే’తో కలిసి ‘స్మార్ట్‌ కీ చైన్‌’‌ను తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు ‘ఫ్లాష్‌ పే’ అని పేరు పెట్టింది. ఈ స్మార్ట్‌ కీ చైన్‌తో కాంటాక్ట్‌ లెస్‌ చెల్లింపులు చేయొచ్చని ఫెడరల్‌ బ్యాంక్‌  వెల్లడించింది. క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుల్లో ఉన్న ట్యాప్‌ అండ్‌ పే ఫీచర్‌ తరహాలోనే ఈ కీ చైన్(Key Chain – Flash Pay) కూడా పనిచేస్తుందని తెలిపింది. ఫెడరల్‌ బ్యాంక్‌ తమ కస్టమర్లకు ‘స్మార్ట్‌ కీ చైన్‌’ను జారీ చేయనుంది. దీని ధర రూ.499. ఆ తర్వాత ఏడాదికి రూ.199 చొప్పున కట్టాలి. సేవింగ్స్/ కరెంట్‌ ఖాతా ఉన్నవారు నెట్‌ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఈ స్మార్ట్ కీ చైన్‌ కోసం అప్లై చేయొచ్చు. ఫెడరల్‌ బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌, నెట్‌ బ్యాంకింగ్‌, ఐవీఆర్ కాలింగ్‌ ద్వారా పిన్‌‌ను సెట్ చేసుకోవచ్చు.క్రెడిట్/ డెబిట్‌ కార్డు తరహాలోనే దీన్ని మనకు ఇష్టం వచ్చినప్పుడు బ్లాక్‌ చేసుకోవచ్చు. అన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join

స్మార్ట్‌ కీ చైన్‌‌ను వాడుకొని రూ.5 వేల వరకు అమౌంటును పిన్‌ ఎంటర్‌ చేయకుండానే కాంటాక్ట్‌ లెస్‌‌గా పే చేయొచ్చు.  అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉంటే.. పిన్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ కీ చైన్‌తో పీఓఎస్‌ యంత్రాల వద్ద ఒక రోజు గరిష్ఠంగా రూ.లక్ష దాకా పేమెంట్ చేయొచ్చు. రోజులో ఐదు లావాదేవీలకు అవకాశం ఉంటుంది. ఫ్లాష్‌ పే రూపే స్మార్ట్‌ కీ చైన్‌ ఉంటే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

Also Read :22 Families Fined : నీళ్లు వేస్ట్ చేశారని.. 22 కుటుంబాలపై రూ.5వేలు చొప్పున ఫైన్