Site icon HashtagU Telugu

Virgin Birth : సెక్స్ లేకుండానే సంతానం.. తొలిసారిగా మొసళ్లలో గుర్తింపు

Virgin Birth

Virgin Birth

Virgin Birth : వర్జిన్ బర్త్  అంటే.. పురుష జీవితో సెక్సువల్ సంబంధాన్ని పెట్టుకోకుండా సంతానం పొందడం!! సెంట్రల్ అమెరికా దేశం కోస్టారికాలోని  ఒక ఆడ మొసలిలో ఇటీవల వర్జిన్ బర్త్ ను శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. స్టడీలో భాగంగా.. కోస్టారికాలోని  ఒక  వైల్డ్‌ లైఫ్ పార్క్‌లో ఆడ మొసలి ఒకదాన్ని గత 16 సంవత్సరాలుగా ఒంటరిగా ఒక ప్రత్యేకమైన నీటి కొలనులో ఉంచారు.అది  ఎట్టకేలకు 2018లో 14 గుడ్లు(Virgin Birth) పెట్టింది. వాటిని జూ సిబ్బంది సేకరించి పొదిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఏమైందో తెలుసా ? 3 నెలలు పొదిగే ఏర్పాట్లు చేసినా.. వాటి నుంచి పిల్లలు ఏర్పడలేదు. 7 గుడ్లు మురిగిపోయాయి. మిగితా 7 గుడ్లకుగానూ 6 గుడ్లలోని పదార్థం పాడైపోయింది. అయితే ఒక్క దాంట్లో మాత్రం పిండాన్ని గుర్తించారు. ఇది కంప్లీట్ ఏర్పడని పిండం. దీనికి జన్యు పరీక్షలు నిర్వహించగా.. దాదాపు తల్లి మొసలి  జన్యువులే ఉన్నాయని  తేలింది.

Also read : No Weight Gain: కొంతమంది ఎంత తిన్న లావుకారు.. ఎందుకు? వాళ్ళలో లోపం ఏమిటంటే?

క్రోమోజోమ్‌లు తగిన సంఖ్యలో లేకపోవడం.. పురుష మొసలి నుంచి స్త్రీ మొసలికి అందాల్సిన వీర్య పదార్థం లేమి వల్ల ఈ వర్జిన్ మొసలి పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు ఏర్పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఈమేరకు వివరాలతో కూడిన రీసెర్చ్ రిపోర్ట్ “బయాలజీ లెటర్స్” జర్నల్‌లో బుధవారం పబ్లిష్ అయింది. ఈవిధంగా జీవులు స్వయంగా పునరుత్పత్తి చేసే ప్రక్రియను పార్థినోజెనిసిస్ లేదా వర్జిన్ బర్త్  అని అంటారు. వర్జిన్ బర్త్  ద్వారా  మొసలి పిల్ల పుడితే దాన్ని పార్థినోజెన్ అంటారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈవిధంగా వర్జిన్ బర్త్  అనేది కింగ్ కోబ్రా, సా ఫిష్, కాలిఫోర్నియా కండోర్స్ వంటి వైవిధ్యమైన జీవులలో జరుగుతుందని చెప్పారు. ఈ రకమైన సంతానోత్పత్తి ప్రక్రియను మొసళ్ళలో గుర్తించడం ఇదే తొలిసారి. టెరోసార్‌లు, డైనోసార్‌లు కూడా వర్జిన్ బర్త్  మార్గంలో సంతానోత్పత్తి చేస్తాయి.