Site icon HashtagU Telugu

Canada: కెనడాలో కార్చిచ్చు..సురక్షిత ప్రాంతాలకు వేలమంది తరలింపు..!

Fire in Canada..thousands evacuated to safer areas..!

Fire in Canada..thousands evacuated to safer areas..!

Canada: కెనడా పశ్చిమ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యం భయానకంగా మారింది. సస్కెట్చివాన్‌ ప్రావిన్స్‌లో విస్తరించిన కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మంటల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఇప్పటికే వేలాది మందిని ఇండ్ల నుంచి తరలిస్తున్నారు. మంటలు నియంత్రణకు అందకుండా పోతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం, సహాయ బృందాలు హై అలర్ట్‌కి వెళ్లాయి సస్కెట్చివాన్‌ ప్రీమియర్‌ స్కాట్‌మో మాట్లాడుతూ..ప్రస్తుతం మేము తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ప్రజల ప్రాణాలు రక్షించడమే మా మొదటి కర్తవ్యంగా భావించి అన్ని చర్యలు చేపట్టాం అని పేర్కొన్నారు. ఈ ప్రావిన్స్‌లో ఇప్పటికే 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు దాదాపు 6,69,000 ఎకరాల పైన విస్తరించాయి. వాతావరణ పరిస్థితులు మద్దతివ్వకపోవడం, గాలులు వేగంగా వీయడం వల్ల మంటలు మరింత వ్యాపిస్తున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పరిస్థితి మరింత సంక్లిష్టమయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Read Also: Gaddar film awards : 2014 నుండి 2023 సినిమాలకు గద్దర్ అవార్డుల ప్రకటన

ఇక మాంటోబా ప్రావిన్స్‌ పరిస్థితీ తీవ్రంగా ఉంది. బుధవారం అక్కడ కూడా అత్యవసర పరిస్థితిని విధించారు. చిన్నచిన్న గ్రామాలు ఖాళీ చేయించబడుతున్నాయి. ఇప్పటికే సుమారు 17,000 మంది తమ ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ మంటలు 1,73,000 ఎకరాలను కాలి బూడిదగా మార్చాయి. “ఇటీవలి కాలంలో ఇంత ప్రబలమైన కార్చిచ్చు చూడలేదు,” అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్తుల్లో సహాయంగా ఉండేందుకు కెనడా వైమానిక దళం రంగంలోకి దిగింది. విమానాల ద్వారా ప్రజలను తరలించడమే కాకుండా, మంటల నియంత్రణకు అవసరమైన పదార్థాలను సరఫరా చేస్తోంది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, రెండు లేదా మూడు రోజులపాటు వర్షం పడితే తప్ప మంటలు అదుపులోకి రాలేవని భావిస్తున్నారు.

ఈ మంటల ధూళి, పొగ వాయు ప్రవాహాల ద్వారా అమెరికాలోని మిన్నెసోటా, మిషిగాన్‌ వంటి రాష్ట్రాలకు చేరుతోంది. దీని ప్రభావంతో అక్కడి ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ది అమెరికన్‌ లంగ్‌ అసోసియేషన్‌ 2025లో విడుదల చేసిన “స్టేట్‌ ఆఫ్‌ ది ఎయిర్‌” రిపోర్టులో పేర్కొంది. 2025లో ఇప్పటివరకు కెనడా మొత్తంలో దాదాపు 15 లక్షల ఎకరాలు కార్చిచ్చుతో దగ్ధమయ్యాయి. కెనడా సహజ వనరుల విభాగం (Natural Resources Canada) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం 6,000కి పైగా కార్చిచ్చు సంఘటనలు నమోదు కాగా, దాదాపు 3.7 కోట్ల ఎకరాల అడవులు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ విపత్తు కేవలం కెనడాకే కాక అమెరికా ప్రజల ఆరోగ్యానికీ ప్రమాదంగా మారింది. ప్రభుత్వం, వైమానిక దళం, రెస్క్యూ బృందాలు మంటల్ని నియంత్రించేందుకు ప్రతినిత్యం కృషి చేస్తున్నప్పటికీ, ప్రకృతి సహకరించకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉంది. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు, స్థానచలనం కోసం మార్గదర్శకాలు అందిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Read Also: Miss World Grand Finale: రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్.. హైటెక్స్ వేదికగా కార్యక్రమం, జ‌డ్జిలు వీరే!