Submarine: జలాంతర్గామిని కనిపెట్టడం చాలా కష్టమే!

  • Written By:
  • Updated On - June 22, 2023 / 05:46 PM IST

అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటానిక్‌ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన జలాంతర్గామీ జాడ…..ఇంకా తెలియలేదు. కుబేరులున్న ఈ జలాంతర్గామిని కనిపెట్టేందుకు అమెరికా, కెనడా బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. సబ్‌మెరైన్‌లో ఆక్సిజన్‌ నిల్వలు 96 గంటలు అంటే గురువారం సాయంత్రం వరకు మాత్రమే వస్తాయని అంచనా. ఐతే అందులో ఉన్న వారు ఆక్సిజన్‌ను పొదుపుగా వినియోగిస్తే మరికొన్ని గంటలు వచ్చే అవకాశం ఉంది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అడ్డంకుల్ని అధిగమించి సబ్‌మెరైన్‌లోని సందర్శకులు క్షేమంగా బయటపడాలని ప్రపంచం ఆశిస్తోంది.

ఈ నెల 18న అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన అమెరికా సబ్‌మెరైన్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ జలాంతర్గామి తప్పిపోయి ఇప్పటికే 5 రోజులైంది. ఈ సబ్‌మెరైన్‌ ఎలా తప్పిపోయింది.? ఓడలో మొత్తం ఎంత మంది ఉన్నారు? దీన్ని కనుగొనే ప్రక్రియలో ఏ దేశాలు పాల్గొంటున్నాయి? లాంటి ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.