Site icon HashtagU Telugu

Vampire Skeleton: వామ్మో..తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచి అస్థికలు.. ఎక్కడో తెలుసా?

Vampire Skeleton

Vampire Skeleton

ఈ భూమి మీద శాస్త్రవేత్తలు ఎన్నో రకాల విషయాలు కనుగొన్నప్పటికీ ఇంకా శాస్త్రవేత్తలకు తెలియని అంతుచిక్కని రహస్యాలు, మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. కాగా ఈ భూమిపై ఉన్న అంతుచిక్కని మిస్టరీల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా పరిశోధలకు ఒక ఆడ వాంపైర్‌ అస్థిపంజరం ఒకటి దొరికింది. వాంపైర్‌ అనగా రక్త పిశాచి. అయితే ఈ అతిపంజరం అసాధారణ రీతిలో తవ్వకాల్లో బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Vampire Skeleton 2

యూరప్‌ దేశం పోలాండ్‌లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్‌ అనే గ్రామంలోని ఓ స్మశానానికి ఆనుకుని ఉన్న నిర్జన ప్రదేశంలో వ్యాంపైర్‌ సమాధిని గుర్తించారు. అయితే టోరన్‌ లోని నికోలస్‌ కోపర్నికస్‌ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టగా అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా గుర్తించారు. ఆ అస్తిపంజరం లో ఆమె మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. అయితే ఆగష్టు లోనే ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలు బయటపెట్టారు. వ్యాంపైర్‌ అనగా కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచి అని అర్థం.

Vampire Skeleton 1

అస్తిపంజరం పై పరిశోధనలు అస్తిపంజరం పై పరిశోధనలు తెలిపిన పరిశోధకులు 17వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవని ఆ యువతిని వాంపైర్‌ గా అనుమానించి అంత ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమెను వ్యాంపైర్‌గా భావించి ఎక్కడ సమాధి నుంచి లేచి వస్తుందో అనే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచేశారు తెలిపారు.

Exit mobile version