Site icon HashtagU Telugu

Telangana : రైతు రుణమాఫీ నిధులు విడుదల

Farmer loan waiver funds released

Farmer loan waiver funds released

Farmer loan waiver funds: ఎన్నికల సమయంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన హామి మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్‌ రైతు రుణమాఫీ(loan waiver)ని విడుదల చేశారు. ఈ మేరకు తొలి విడతలో 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ. లక్ష వరకు రుణమాఫీని విడుదల చేశారు. తొలి విడతలో 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు వేశారు. రైతుల ఖాతాల్లోకి రూ. 7 వేల కోట్లును రెండో విడతలో ఈ నెలాఖరులోపే రూ. లక్షన్నర విడుదల చేశారు. రుణమాఫీని ఆగస్టు దాటక ముందే రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. దీంతో వీరందరి రుణాలు ఇప్పుడు మాఫీ కానున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, రైతు రుణమాఫీ(loan waiver)కి రూ.31 వేల కోట్లు ఖర్చు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమఫీ నిధులను వేరే అప్పులకు జమచేయవద్దని ఇప్పటికే బ్యాంకర్ల(Bankers)కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల రుణమాఫీ పథకం వర్తిస్తుందని చెప్పారు. కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకుంటామని, రేషన్‌ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈనెల ఆఖరు వరకు రూ.లక్షన్నర లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఆ తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేయనుంది. ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు.

Read Also: Prabhas : ప్రభాస్, హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్..!

మరోవైపు కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో(Congress Election Manifesto)లో ఇచ్చిన హామీ మేరకు ఫేస్‌ -1 కింద 18న రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తుండడంతో ఘనంగా సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రంలోపు బ్యాంకుల్లో రుణమాఫీ నగదు జమ చేయగానే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు.

రైతు కుటుంబాన్ని గుర్తించడానికి ఆహార భద్రతాకార్డు వివరాలు ప్రామాణికంగా రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న షెడూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకారం కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తించనుంది. పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక నోడల్‌ అధికారిని నియమించగా, ఆ అధికారి నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌కు సమన్వ యకర్తగా వ్యహరించనున్నారు. డిసెంబరు 12, 2023 నాటికి రైతుకు ఉన్న రుణం, లేక రెండు లక్షల వరకు ఏది తక్కువైతే దాన్ని పొందేందుకు రైతులు అర్హులు. అలాగే రెండు లక్షల మించిన రుణం ఉన్న రైతులు ఆపైన ఉన్న రుణాన్ని మొదట చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన ఉండగా, ఆ తరువాతనే రుణమాఫీ పొందే వెసులుబాటు కల్పించింది.

Read Also: Teeth Pain: పంటినొప్పి తెగ ఇబ్బంది పెడుతోందా.. అయితే ఇలా చేయాల్సిందే?